iDreamPost

కోడి పందాలు చూశారు.. పందుల పందాలు చూశారా??

కోడి పందాలు చూశారు.. పందుల పందాలు చూశారా??

మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు చూస్తూనే ఉంటాము. ఇక సంక్రాంతి వస్తే ఆంధ్రాలో ఏ రేంజ్ లో కోడి పందాలు నిర్వహిస్తారో అందరికి తెలిసిందే. కోడి పుంజులకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహిస్తారు. పొట్టేళ్లు, మేకపోతుల పందాలు కూడా చూసే ఉంటాము. కానీ కొత్తగా పందుల పందాలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా కొన్ని చోట్ల ఈ పందుల పోటీలను నిర్వహించారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపంలోని దిగువ అబ్బవరంలో తాజాగా పందుల పోటీ నిర్వహించారు. కోళ్లు, పొట్టేళ్ల పందాలు లాగే వీటిని కూడా రెచ్చగొట్టి వదిలారు. ఇంకేముంది అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీ కొట్టడం, నోటితో కరవడం, కాళ్లతో రక్కడం.. లాంటివి చేస్తూ పందెంలో పాల్గొన్నాయి ఈ వరాహాలు. కొన్ని పందులు పోటీ పడలేక పారిపోయాయి. ఇందులో గెలిచిన వాటికి బహుమతులు కూడా ప్రకటించారు. విజేతలయిన వరాహాలకు దాదాపు 2లక్షల రూపాయల వరకు బహుమతులని ప్రకటించారు నిర్వాహకులు. ఇక ఈ పందుల పోటీలను చూసేందుకు చాలా మంది ప్రజలు చుట్టుపక్క గ్రామాల నుంచి కూడా వచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి