iDreamPost

ఇదెక్కడి దారుణం.. భార్య నిద్రలో ఉండగానే భర్త..

Crime News: ప్రస్తుతం రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా దంపతుల మధ్య గొడవలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు కానీ, కట్టుకున్న వారిపై దారుణాలకు ఒడిగడుతున్నారు.

Crime News: ప్రస్తుతం రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా దంపతుల మధ్య గొడవలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు కానీ, కట్టుకున్న వారిపై దారుణాలకు ఒడిగడుతున్నారు.

ఇదెక్కడి దారుణం.. భార్య నిద్రలో ఉండగానే భర్త..

ప్రస్తుతం ప్రాంతంతో సంబంధం లేకుండా భార్యాభర్తల సంబంధాలు మరీ దారుణంగా దిగజారిపోతున్నాయి. ఎవరూ కూడా కలిసి కాపురం చేసేందుకు మొగ్గు చూపడం లేదు. కారణం చిన్నది అయినా పెద్దది అయినా గొడవలు పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఆ గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. ఈ గాలివాన బీభత్సానికి కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతోంది. కట్టుకున్న భార్య అంటే భర్తకు ప్రేమ ఉండటం లేదు. భర్తని భార్యని పట్టించుకోవడం లేదు. అలాంటి చిన్న చిన్న కారణాలతోనే క్షణికావేశంలో ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది.

భార్యభర్తల బంధం నమ్మకం, ప్రేమానురాగాలు పునాదులుగా నిలవాలి. కానీ, ఇప్పుడు అనుమానం, అజమాయిషీ అనే పదాలు కుటుంబాలను శాసిస్తున్నాయి. ఎక్కువగా భార్యభర్తల మధ్య గొడవలకు కూడా అవే కారణంగా మారుతున్నాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. యోగానందరెడ్డి, రమ్మణమ్మ(32)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగినట్లు తెలుస్తోంది. కానీ, ఎందుకో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు తరచూ ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉండేవాళ్లు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. భార్య రమణమ్మని హత్య చేసేందుకు యోగానందరెడ్డి ఫిక్స్ అయ్యాడు. అందుకోసం అతను పథకం కూడా రచించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున పథకం యోగానందరెడ్డి రమణమ్మను హత్య చేశాడు. ఆమె నిద్రలో ఉండగా.. రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అతను నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.

యోగానందరెడ్డి తన భార్యని తాను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఆ విషయం విన్న సీఐ జీవన్ రంగనాథ్ బాబు, ఎస్ఐ విష్ణ్ వర్థన్ లు యోగానందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఘటనాస్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరుని పరిశీలించారు. ఆ తర్వాత యోగానందరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం రమణమ్మ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హత్యకు ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు, తరచూ గొడవలు జరగడమే కారణంగా చెప్తున్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పొరుగువారి నుంచి సమచారం తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు, భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయి. ఈ గొడవలే ఇలాంటి దారుణాలకు కారణంగా మారుతున్నాయి. ఇలాంటి గొడవలు, హత్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి