iDreamPost

APలోని ఆ జిల్లాలో చికెన్ తినాలంటే భయపడుతున్నారు!

Bird flu: నిత్యం ఏదో ఒక వైరస్ జనాలను భయపెడుతూనే ఉంటుంది. అలానే తాజాగా బర్డ్ ఫ్లూ అనేది వైరస్ ఏపీలోని ఓ జిల్లా ప్రజలను భయపెడుతోంది. అందుకే చికెన్ తినాలంటే కూడా భయపడిపోతున్నారు. మరి.. ఆవివరాలు ఏమిటో..

Bird flu: నిత్యం ఏదో ఒక వైరస్ జనాలను భయపెడుతూనే ఉంటుంది. అలానే తాజాగా బర్డ్ ఫ్లూ అనేది వైరస్ ఏపీలోని ఓ జిల్లా ప్రజలను భయపెడుతోంది. అందుకే చికెన్ తినాలంటే కూడా భయపడిపోతున్నారు. మరి.. ఆవివరాలు ఏమిటో..

APలోని ఆ జిల్లాలో చికెన్ తినాలంటే భయపడుతున్నారు!

బర్డ్ ఫ్లూ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో దీని కారణంగా కొన్ని వందల కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. అంతేకాక చికెన్ తినేందుకు ప్రజలు భయపడిపోయారు. ఆ తరువాత పరిస్థితులు మారి.. యథాస్థితికి వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఏపీలోని ఓ జిల్లాలో బర్డ్ ఫ్లూ  కలకలం రేపింది. అక్కడి ప్రాంత ప్రజలు చికెన్ తినేందుకు కూడా బయపడుతున్నారు. అంతేకాక ఆ ప్రాంతాల్లో చికెన్ షాపుల కూడా మూసివేశారు. ప్రజలందరూ చికెన్ బదులు చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. పలు గ్రామాల్లో అయితే చికెన్ ఫ్రీగా ఇస్తామంటే కూడా వద్దంటే వద్దు అంటున్నారు. మరి.. ఆ జిల్లా ఏది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగిన సంగతి తెలిసింది. కొన్ని రోజుల నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి శాంపిల్స్ తీసుకుని భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపగా.. ఆ కోళ్లు చనిపోవడానికి ఎవిఎఎన్‌ ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ) అని నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ప్రజలకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్‌ షాపు యజమానులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

ఇది ఇలా ఉంటే.. ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు  పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న చికెన్ షాపులను 3 రోజులపాటు మూసివేయాలని, ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న షాపులను 3 నెలల వరకు తెరవకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుండి కోళ్లను తీసుకురాకూడదని  నెల్లూరు కలెక్టర్ సూచించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని, కోళ్ల ఫాంలు, ఆ కోళ్ల వద్ద పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇది ఇలా ఉంటే..బర్డ్ ఫ్లూ కలకలంతో నెల్లూరు జిల్లాలోనే  పలు గ్రామాల ప్రజలు చికెన్ తినేందుకు బయపడుతున్నారు. అధికారులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అందుకే నిన్న ఆదివారం సైతం చికెన్ ను కాదని, చేపలకు, మటన్ వైపు మొగ్గు చూపారు. మాములుగానే నెల్లూరు చేపల అంటే ఎంతో ఫేమస్..ఈ బర్డ్ ఫ్లూ ప్రభావంతో నిన్నటి ఆదివారం చేపల అమ్మకాలు బాగా పెరిగాయని సమాచారం. ఇక పలు గ్రామాల్లో చికెన్ షాపు యాజమానులు చికెన్  ఫ్రీగా ఇస్తామని చెబుతున్న వద్దంటే వద్దని స్థానిక ప్రజలు అంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వ్యాధి సోకిన చాటగొట్ల, గుమ్మలదిబ్బ గ్రామాలకు కిలో మీటరు ప్రాంతాన్ని ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్‌ ప్రాంతంగా ప్రకటించారు. మరి.. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి