iDreamPost

గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నిలబెట్టుకున్న పిడిఎఫ్, కృష్ణా తీరంలో రెండో ప్రాధాన్యత ఓట్ల.లెక్కింపు

గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నిలబెట్టుకున్న పిడిఎఫ్, కృష్ణా తీరంలో రెండో ప్రాధాన్యత ఓట్ల.లెక్కింపు

ఏపీలో జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో.లెక్కింపు ప్రక్రియ ముగింపునకు వచ్చింది. ఉభయగోదావరి జిల్లాల స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో పిడిఎఫ్ నిలబెట్టుకుంది. ఆరేళ్ళ క్రితం ఇక్కడ రాము సూర్యారావు విజయం సాధించారు. ఈసారి ఆయన స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థిగా షేక్ సాబ్జి బరిలో దిగారు.

ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మామ గంధి నారాయణరావు నుంచి పోటీ ఎదురయ్యింది. కానీ ఉపాధ్యాయులు సాబ్జికి మద్దతు పలికారు. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఏమ్మెల్సీగా 8,145 ఓట్ల తో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించారు. ఆయనకి మెజారిటీ 1,517 ఓట్లు దక్కడంతో సునాయాసంగా విజయం సాధించారు.

కృష్ణా -గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో పిడిఎఫ్ వెనుకబడింది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఇక్కడ రెండో స్థానంలో ఉన్నారు. కల్పలత ఆధిక్యంలోఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి అవసరమైన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. కడపటి వార్తలు అందేసరికి కల్పలత 3818 ఓట్లు సాధించి ముందంజలో ఉన్నారు. బొడ్డు నాగేస్వరారావు 2760 సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ 1950 ఓట్లు మాత్రమే సాధించారు.

తెలంగాణ పట్టభద్రుల రెండు స్థానాల్లోనూ ఓట్ల.లెక్కింపు సాగుతోంది. తొలి విడత ఓట్లు కట్టలు కట్టే పని జరుగుతుంది. అర్థరాత్రి దాటిన తర్వాత అది పూర్తయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి ట్రెండింగ్ వెలువడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ ఎక్కువగా జరగడంతో ఈసారి మరింత జాప్యం తప్పేలా లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి