iDreamPost

BCCIపై కోపంతో రగిలిపోతున్న పాకిస్థాన్‌! కారణం ఏంటి?

BCCIపై కోపంతో రగిలిపోతున్న పాకిస్థాన్‌! కారణం ఏంటి?

వన్డే వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగిపోతోంది. కప్పు గెలవడమే లక్ష్యంగా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లీగ్ మ్యాచ్ లు ఉత్కంఠపోరుతో జరుగుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తున్నాయి. కాగా ప్రపంచ కప్ లో భాగంగా అక్టోబర్ 14న భారత్, పాక్ మధ్యన హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో పాక్ బోర్డు, జట్టుపై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్ జరిగిన రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకులు వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ రగిలిపోతోంది. దీంతో బీసీసీఐపై ఐసీసీకి పాక్ బోర్డు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

భారత్, దాయాదుల మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లో 191 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి పాక్ జట్టు విలవిల్లాడిపోయింది. టీమిండియా బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక్కొక్కరు వికెట్లు చేజార్చుకుంటూ పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ మెరుపు బ్యాటింగ్ తో అలవోకగా పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ హోరాహోరి పోరు జరుగుతున్న సమయంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన లక్షకుపైగా అభిమానులు భారత్ కు మద్దతుగా నిలిచారు.

మ్యాచ్ ఆరంభం నుంచే టాస్ సమయంలో బాబర్ మాట్లాడుతున్నప్పుడు పెద్దగా కేకలు వేస్తూ హేలన చేయడం, రిజ్వాన్ అవుటవ్వగానే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పాక్ ప్లేయర్లు ఒత్తిడికి గురయ్యేలా స్టేడియంలోని ప్రేక్షకులు క్రౌడ్ క్రియేట్ చేశారు. ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన పాక్ బోర్ట్ పీసీబీ బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టెలిగ్రాఫ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన పాక్ టీమ్ కు ఫ్యాన్స్ స్వాగతం పలికారు. ఇప్పటి వరకు పాక్ ఆడిన లీగ్ మ్యాచ్ లలో ఫ్యాన్స్ మద్దతు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి