iDreamPost

జనసేన అధినేత పవన్‌కూ వెన్నుపోటు..ఎట్లంటే?

ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది. కొద్ది నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే వెన్నుపోటు అనే పదం కూడా తరచూ వినిపిస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ కూడా వెన్నుపోటుకు గురవుతారనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది. కొద్ది నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే వెన్నుపోటు అనే పదం కూడా తరచూ వినిపిస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ కూడా వెన్నుపోటుకు గురవుతారనే టాక్ వినిపిస్తోంది.

జనసేన అధినేత పవన్‌కూ వెన్నుపోటు..ఎట్లంటే?

రాజకీయం అనే చదరంగంలో ఎత్తులకు పైఎత్తులు ఉంటాయి. ఈ రాజకీయ రణరంగంలో నిలబడి గెలవాలంటే..అంత సులభం కాదనేది చాలా మంది అభిప్రాయం. అయితే మోసం, వెన్నుపోటు వంటి  అక్రమ మార్గాల్లో కొందరు రాజకీయ నేతలుగా ఎదిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక రాజకీయాల్లో తరచూ వినిపించే పదం వెన్నుపోటు. చాలా మంది నాయకులు తాము వెన్నుపోటుకు గురయ్యామని చెప్పుకుంటారు. అయితే వెన్నుపోటు అనగానే ఠక్కున అందరికి గుర్తుకు వచ్చే పేరు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఈ పోటు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యా అని చాలామంది అంటుంటారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి 40ఏళ్లకు పై రాజకీయ అనుభవం ఉంది. 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన అతి చిన్న వయస్సులోనే సీఎంగా ఎన్నికయ్యారు. కానీ ఆయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాత్రం సీఎం కావడానికి చాలా ఏళ్లు పట్టింది. అయితే చంద్రబాబు.. సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. సీఎం సీటు లాక్కున్నారని చాలా ఏళ్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాక చంద్రబాబు ప్రత్యర్థులు కూడా నేటికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంశాని తెరపైకి తెస్తుంటారు. చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ ను అవమానీయంగా సీఎం పదవిని నుంచి కూలదోశాడని రకరకాల ప్రచారాలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా చంద్రబాబు వెన్నుపోటు జాబితాలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరనున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వారు వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలు సాక్షిగా ప్రకటించారు.  ఆ తరువాత ఇరు పార్టీలు  ఉమ్మడిగా రెండు దఫాలు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాయి.  ఉమ్మడి కార్యాచరణతో, కలిసి పని చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఇంత వరకూ  బాగానే ఉన్నా.. టికెట్ల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమన్వయం అనే మాటను టీడీపీ చాలా వ్యూహాత్మకంగా విస్మరించిందని, దీన్నే చంద్రబాబు భాషలో వెన్నుపోటు అని అంటారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  పొత్తుల్లో అత్యంత కీలకమైన సీట్ల పంపిణీ అంశంలో జనసేనతో సంబంధం లేకుండా టీడీపీ తన పని తాను చేసుకెళ్తోందని  పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్  అభిప్రాయాలను గౌరవించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలనే ఆలోచన టీడీపీలో లేదని కొందరు జనసేన నేతలే  విమర్శిస్తున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే రాబోయే రెండు నెలల్లో 13 నుంచి 140 మంది అభ్యర్థులకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు టీడీపీ కసరత్తు చేస్తోందని టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే   చాలా మందికి పరోక్షంగా చంద్రబాబు, లోకేశ్ టికెట్ల పై క్లారిటీ ఇచ్చారని సమాచారం.  జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో వారికి కేటాయించే సీట్ల అంశంపై టీడీపీ దృష్టి సారించలేదంట.

జనసేనకు గరిష్టంగా  20 సీట్లు ఇచ్చి, పవన్ సామాజిక వర్గాన్ని టీడీపీ వాడుకునేందుకు నిర్ణయించింది. వైసీపీ బలంగహా ఉన్న చోట జనసేనకు కట్టబెట్టి, చేతులు దులుపుకోవడానికి టీడీపీ ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.   అయితే చంద్రబాబు మనస్తత్వం తెలిసి కూడా పవన్ మద్దతు పలికారని, ఇందుకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. పవన్ కల్యాణ్ కూ వెన్నుపోటు తప్పదూ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి