iDreamPost

Pawan Kalyan : నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసిన పవర్ స్టార్

Pawan Kalyan : నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసిన పవర్ స్టార్

అంచనాలను మించి భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద వద్ద చెడుగుడు ఆడిస్తోంది. మొదటి రోజే చాలా కేంద్రాల్లో రికార్డులు సృష్టించి వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఏపిలో కఠిన నిబంధనలు, పరిమిత షోలు, టికెట్ రేట్ల ఆంక్షలు ప్రభావితం చూపడం ఏ మేరకు నష్టం తెస్తుందనే దాని మీదే ఇప్పుడే అంచనాకు రాలేం. రెగ్యులర్ ప్రైజ్ తో అమ్మడం ప్రేక్షకుల కోణంలో మంచి పరిణామమే అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు ఎంతకు కొన్నారనేది లాభనష్టాలను నిర్ణయించనుంది. కొన్ని చోట్ల థియేటర్లు తెరవలేదనే వార్తలు ఉన్నాయి కానీ వాటికి సంబంధించిన ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం

ఒక్క నైజాంలోనే 11 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టిన భీమ్లా ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో మరింత రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ ధరలు ఇక్కడ కీలక పాత్ర పోషించాయి . మల్టీ ప్లెక్సులు 295 రూపాయలు పెట్టినప్పటికీ హౌస్ ఫుల్స్ పడటం  గమనార్హం. సింగల్ స్క్రీన్లలో సైతం 175 రూపాయలు ఫిక్స్ చేశారు. దీనికి రెండు వారాల అనుమతి ఉంది కాబట్టి ఫిగర్స్ ఇంకా గట్టిగ ఉండబోతున్నాయి. ఏపిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నప్పటికీ మరీ దారుణంగా అయితే లేదు. సీడెడ్ లో 3 కోట్లకు పైగా రావడం దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. 36 కోట్ల దగ్గరకు గ్రాస్ తీసుకెళ్లిన భీమ్లా నాయక్ ఏరియాల వారీగా ఇలా ఉన్నాడు

నైజాం – 11 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 1 కోటి 80 లక్షలు
గుంటూరు – 2 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 90 లక్షలు
వెస్ట్ గోదావరి – 3 కోట్ల 2 లక్షలు
కృష్ణా – 89 లక్షలు
నెల్లూరు – 1 కోటి 2 లక్షలు

ఏపి / తెలంగాణ – 26 కోట్ల 16 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 3 కోట్లు
ఓవర్సీస్ – 6 కోట్ల 70 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు షేర్ – 35 కోట్ల 86 లక్షలు

ఈ లెక్కన చూస్తే ఇదే స్పీడ్ కనక కొనసాగిస్తే టార్గెట్ పెట్టుకున్న 107 కోట్ల షేర్ ని అందుకోవడం అసాధ్యం కాదు కానీ మరీ అంత సులభం కూడా కాదు. పుష్ప తరహాలో స్ట్రాంగ్ రన్ ని కనీసం పది రోజులు కొనసాగించాలి. వచ్చే వారం మార్చి 4న మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అలా చూసుకుంటే మార్చి 10 దాక  చక్కని వసూళ్లు రాబట్టుకోవచ్చు. 11న రాధే శ్యామ్ వస్తుంది కాబట్టి ఆలోగానే మాగ్జిమమ్ రన్ ని పూర్తి చేసుకోవాలి. ఇవాళ్టి బుకింగ్స్ కూడా చాలా వేగంగా ఉన్నాయి. అడ్వాన్స్ లోనే టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. చూడాలి మరి బ్రేక్ ఈవెన్ కి భీమ్లా ఎంత టైం తీసుకుంటాడో

Also Read : Puneeth Rajkumar : జేమ్స్ కు శాండల్ వుడ్ ఘనమైన నివాళి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి