iDreamPost

కదులుతున్న రైలు నుంచి Phone దొంగతనం.. ప్రయాణికులకు అడ్డంగా దొరికిన దొంగ!

కదులుతున్న రైళ్లో ఫోన్ కొట్టేసి పారిపోదామనుకున్న దొంగకు ప్రయాణికులు చుక్కలు చూపించారు. దొంగను పట్టుకుని రైలుకు వేలాడుతుండగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కదులుతున్న రైళ్లో ఫోన్ కొట్టేసి పారిపోదామనుకున్న దొంగకు ప్రయాణికులు చుక్కలు చూపించారు. దొంగను పట్టుకుని రైలుకు వేలాడుతుండగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కదులుతున్న రైలు నుంచి Phone దొంగతనం.. ప్రయాణికులకు అడ్డంగా దొరికిన దొంగ!

ఈజీమనీకి అలవాటు పడిన కొందరు ఆకతాయిలు దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడి ఇళ్లల్లో దొంగతనాలు చేసి డబ్బు, నగలు కొట్టేస్తూ వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. బస్టాండ్ లల్లో, రైల్వే స్టేషన్ లలో దొంగల బెడద ఎక్కువే. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రదేశాల్లోనే కాదు..కదులుతున్న రైళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కిటికీలు, డోర్ల దగ్గర కూర్చున్న ప్యాసింజర్లను టార్గెట్ చేస్తూ గోల్డ్ చైన్లను, మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొసారి ప్రయాణికులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇదే విధంగా ఓ దొంగ కదులుతున్న రైళ్లో ఫోన్ కొట్టేయగా అతడిని ప్రయాణికులు పట్టుకున్నారు. ఆ తర్వాత కిలోమీటర్ దూరం వరకు దొంగ రైలుకు వేలాడుతుండగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు.

బస్ జర్నీ, ట్రైన్ జర్నీ చేసేటపుడు సాధారణంగా కాలక్షేపం కోసం మొబైల్ ఫోన్ వాడుతుంటారు. ఈ సమయంలోనే దొంగలు వారి చేతికి పనిచెప్తుంటారు. ఫోన్ లో లీనమైన ప్రయాణికుల వద్ద నుంచి మొబైల్ కొట్టేసి పారిపోతుంటారు. కొన్ని సార్లు దొంగతనం చేస్తూ వారి చేతికి చిక్కి చావు దెబ్బలు తింటుంటారు. ఈ క్రమంలో కదులుతున్న రైళ్లో ఫోన్ దొంగతనం చేసి తప్పించుకుందామనుకున్న దొంగకు ప్రయాణికులు షాకిచ్చారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. భగల్ పూర్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడి ఫోన్‌ను కొట్టేయాలని చూసాడు ఓ దొంగ.

డోర్ వద్ద ఓ ప్రయాణికుడు ఫోన్ మాట్లాడుతుండగా అతడి వద్ద నుంచి ఓ దొంగ ఫోన్ లాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఆ ఫోన్ యజమాని ఆ దొంగను పట్టుకున్నాడు. అందులోని ప్రయాణికులు ఆ దొంగనీ గట్టిగా పట్టుకుని కిలోమీటర్ దూరం వరకు కొట్టుకుంటు తీసుకువెళ్లారు. ఈ సమయంలో దొంగ ట్రైన్ డోర్ వద్ద వేలాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మరి కదులుతున్న ట్రైన్ లో మొబైల్ దొంగతనం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి