iDreamPost

పరిటాల ముఖ్య అనుచరునికి జీవిత ఖైదు

పరిటాల ముఖ్య అనుచరునికి జీవిత ఖైదు

పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడు గుర్రం మనోహర నాయుడు పై ఒక కిడ్నాప్ కేసులో అభయోగాలు రుజువు కావడంతో అనంతపురం జిల్లా కోర్ట్ ఈరోజు ఈ కేసులో మొదటి ముద్దాయి గుర్రం మనోహర నాయుడుకి జీవిత ఖైదుతో పాటు 21,500 రుపాయాల జరిమాన విధిస్తునట్టు ఎస్సీ/ఎస్టీ ఎనిమిదవ అదనపు షెషన్స్ జడ్జ్ శ్రీమతి పి. కమలాదేవి గారు సంచలన తీర్పు వెలువరించారు.

కేసు పూర్వపరాల్లొకి వెళితే 2016 ఫిభ్రవరి 19 న రాత్రి పదిన్నర సమయంలో అనంతపురం జొన్నా వీరయ్యకాలనీ కి చెందిన యన్నం ఆంథోనీ రెడ్డి ఇంటికి పోతూఉండగా మార్గమధ్యలో గుర్రం మనోహర్ నాయుడు, కార్తీక్, చాకలి మారుతి, బోయ తిమ్మరాజు, నీళ్ళపాళ్ళ రాజేందర్, వెంకటేష్, బోయ మల్లికార్జున అందరూ కలసి ఆంథోనీ రెడ్డి ని కిడ్నాప్ చేసి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే చంపుతాము అని ఆంటోని రెడ్డిని బెదిరించారు.

కిడ్నాపర్ల మీద ఆంటోని రెడ్డి అనంతపురము టూ టౌన్ పొలిస్ స్టేశన్ లొ ఫిర్యాదు చెయ్యడంతో 2016 లొ మనోహర్ నాయుడుతోపాటు ఆతని కలసి కిడ్నాప్ ఘటన లో పాలుపంచుకున్న వ్యక్తుల పై కిడ్నాప్ కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన పై విచారణ చేపట్టిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ శుభకుమార్ 2016 ఫిభ్రవరి 24 వతేదిన ముద్దాయిలందరిని అరెస్టు చేసి వారి పేర్లను చార్జ్ షీట్ లో నమోదు చేశారు.

కాగా ఈరోజు (25.02.2020) అనంతపురం జిల్లా SC/ST ఎనిమిదవ అదనపు షెషన్స్ జడ్జ్ శ్రీమతి పి. కమలాదేవి గారు మొదటి ముద్దాయి అయిన సదరు గుర్రం మనోహర్ నాయుడు (రౌడీ షీటర్ నంబర్-545 ఆఫ్ అనంతపురము టూ టౌన్ పి.ఎస్.) కు జీవిత ఖైదు శిక్ష తో పాటు Rs. 21,500 రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది.

ప్రాసిక్యూషన్ తరుపున అడ్వకేట్ తారకేశ్వర్లు వాదించారు. ఇందులో కోర్ట్ హెడ్ కానిస్టేబుల్-2367 శ్రీ జి.అక్కుల్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్-3305 శ్రీ Y. ప్రసాద్ మరియు కోర్ట్ కానిస్టేబుల్-2964 శ్రీ కె. ఆనంద్ యాదవ్ గారు సరైన సమయంలో సాక్షులను కోర్ట్ వారి ముందు హాజరుపరిచి నిందితుడికి శిక్షపడటానికి సహాయపడ్డారు. సదరు కోర్ట్ సిబ్బందిని అనంతపురము టూ టౌన్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సైన్ ఖాన్ కాష్ రివార్డ్ ఇచ్చి అభినందించారు.

జీవిత ఖైదు పడ్డ నిండుతుడు గుర్రం మనోహర్ నాయుడు పై గతంలో అనేక కేసులు నమోదవడంతో ఇతని మీద అనంతపురం టూ టౌన్ స్టేషన్ లొ రౌడీ షీట్ కుడా ఓపెన్ చేశారు. ఇతను పరిటాల శ్రీరామ్ కు సన్నిహితంగా వ్యవహరిస్తుండేవాడు. శ్రీరామ్ ప్రధాన అనుచరుడికే జీవిత ఖైదు విధించిన నేపధ్యంలో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త తీవ్ర చర్చినియాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి