iDreamPost

చనిపోయిన కుమారుడికి గుడి కట్టి పూజిస్తున్న తల్లిదండ్రులు

చనిపోయిన కుమారుడికి గుడి కట్టి పూజిస్తున్న తల్లిదండ్రులు

భార్యా భర్తలు తల్లిదండ్రులుగా మారాక.. వారి ఆశలన్నీ పిల్లలపైనే. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి ఎటువంటి కష్టం కాన రాకుండా చూసుకుంటారు. వారి కోరికలు తీర్చేందుకు తండ్రి అహర్నిశలు కష్టపడుతుంటాడు. తల్లి ఆలనా పాలనా చూస్తుంది. మంచి చదువులు చెప్పించి, వారిని ఉన్నత తీరాలకు చేర్చుతారు తల్లిదండ్రులు. పిల్లలు చేతికి అంది వచ్చాక.. వారు ప్రయోజకుల అయ్యి సంపాదనలో పడితే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాలు వెల్లువిరుస్తుంటాయి. ఇక చేతికొచ్చిన పిల్లలకు పెళ్లి చేసి, మనవళ్లతో ఆడుకోవాలని అనుకుంటారు.కానీ ఆ సమయంలోనే పిల్లలు కానరాని లోకాలకు తిరిగి వెళ్లిపోతే.. ఆ తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతం. అందులోనూ కుమారుడు చనిపోతే.. పుత్రకోశాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. అదే జరిగింది ఆ తల్లిదండ్రులకు. తల కొరివి పెట్టాల్సిన కొడుకుకు, వారే కర్మకాండలు చేయాల్సి వచ్చింది. కుమారుడు లేడన్న బాధను దిగమింగులేకపోయారు వారు. అతడిని మర్చిపోలేక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని..పూజలు చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఆ దంపతులు.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన ఆదినారాయణ, నాగలక్ష్మి దంపతులు. వీరిద్దరూ రిటైర్డ్ ఉద్యోగులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. తండ్రి ఆదినారాయణ రైల్వేలో గేట్ మెన్‌గా పనిచేసి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ ఉద్యోగాన్ని కొడుక్కి ఇప్పించాడు.అంతా హాయిగా సాగిపోతుందని అనుకున్న సమయంలో అనారోగ్య సమస్యలతో కుమారుడు మృతి చెందాడు. కుమారుడు లేడన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేపోయారు వృద్ద దంపతులు. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. కుమారుడి విగ్రహాన్ని తయారు చేయించి.. ఇంట్లోనే గుడి కట్టారు. పది లక్షల రూపాలు పెట్టి తెనాలిలో ప్రత్యేకంగా చేయించారు. ప్రతి రోజు విగ్రహానికి దుస్తులు మారుస్తూ.. పూజలు చేస్తూ.. తమ కొడుకు తమతోనే ఉన్నాడని భావిస్తున్నారు. అలాగే తమ కొడుకు గంగాధర్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మలిదశను కొనసాగిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి