iDreamPost

Parampara : పరంపర వెబ్ సిరీస్ రిపోర్ట్

Parampara :  పరంపర వెబ్ సిరీస్ రిపోర్ట్

బాహుబలి నిర్మాతల ఓటిటి వెంచర్ లో భాగంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర మొన్న శుక్రవారం నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శరత్ కుమార్, జగపతిబాబు, నవీన్ చంద్ర లాంటి నోటెడ్ ఆర్టిస్టులతో పాటు ట్రైలర్ లో చూపించిన ప్రొడక్షన్ వేల్యూస్ భారీగా కనిపించడంతో దీని మీద ఆసక్తి పెరిగింది. దీనికి కృష్ణ విజయ్ – విశ్వనాథ్ అరిగెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పవర్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ టచ్ ఇస్తూ సాగిన ఈ యాక్షన్ డ్రామా మొత్తం ఏడు ఎపిసోడ్ల రూపంలో వచ్చింది. అన్నీ కలిపి సుమారు 6 గంటలకు దగ్గరగా నిడివి ఉండటం విశేషం. మరి సినిమా రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన పరంపర ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

వీరనాయడు(మురళీమోహన్)విశాఖలో జనం మేలు కోరే మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ధనవంతుడు. ఇద్దరు కొడుకులు. మోహనరావు(జగపతిబాబు)మొదటివాడు దత్తపుత్రుడు కాగా రెండోవాడు నాగేంద్రరావు(శరత్ కుమార్) రక్తం పంచుకు పుట్టిన సంతానం. ఓ అనూహ్యమైన సందర్భంలో వీరనాయుడు హత్య చేయబడతాడు. దీంతో కుటుంబ బాధ్యత మోహనరావుకు ఇచ్చి నాగేంద్ర ఆర్థిక వ్యవహారాలు తన చేతుల్లోకి తీసుకుంటాడు. దీన్ని సహించలేకపోయిన మోహనరావు కొడుకు గోపి(నవీన్ చంద్ర) ఇంట్లోనే రాజకీయం మొదలుపెడతాడు. బాబాయ్ కొడుకు సురేష్(ఇషాన్)భాగమవుతాడు. ఆ తర్వాత జరిగేది సిరీస్ లో చూడాలి.

ఒకరకంగా చూస్తే పరంపరలో మెయిన్ పాయింట్ దేవా కట్ట ప్రస్థానం నుంచి తీసుకున్నదే. ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయినా దర్శకుడు ఇదే ప్లాట్ ని తీసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అదేమీ పెద్ద మైనస్ కాదు కానీ వెబ్ సిరీస్ కాబట్టి నిడివి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో సాగతీత చేయడంతో చాలా చోట్ల బోర్ కొట్టేస్తుంది. మూవీ లెన్త్ కు సరిపోయే ప్లాట్ ని తీసుకుని ఇంత సుదీర్ఘమైన సిరీస్ గా మార్చడం అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. కొన్ని ఇంటిమసి సీన్లు ఇబ్బంది పెడతాయి. స్క్రీన్ ప్లే ఒకదశ వరకు బాగున్నప్పటికీ ఆ తర్వాత ఫార్వార్డ్ బటన్ కి పని చెప్పక తప్పలేదు. మొత్తానిక్ డ్రాగ్ ఉన్నా పర్లేదు ఇంటెన్స్ డ్రామా ఉంటే చాలు రొటీన్ గా ఉన్నా చూసేస్తాం అనుకుంటే పరంపర పర్వాలేదు అనిపిస్తుంది. అది కూడా పరిమిత అంచనాలతో

Also Read : Krish Srikkanth And Nagarjuna : సినిమాకు క్రికెట్ కు దోస్తీ ఎలా కుదిరింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి