iDreamPost

Ayodhya: అయోధ్యపై పాక్‌ అక్కసు.. మందిర ప్రారంభోత్సవం వేళ కారు కూతలు!

  • Published Jan 23, 2024 | 11:54 AMUpdated Jan 23, 2024 | 11:54 AM

ఎట్టకేలకు అయోధ్యలో ఆ బాల రామ చంద్రుడు కొలువుతీరాడు. యావత్ భారతదేశం నిన్నటి రోజున ఎంతో ఆనందంగా.. ఈ వేడుకను జరుపుకుంది. ఈ క్రమంలో పొరుగు దేశం అయిన పాకిస్తాన్ మాత్రం అయోధ్యకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంది.

ఎట్టకేలకు అయోధ్యలో ఆ బాల రామ చంద్రుడు కొలువుతీరాడు. యావత్ భారతదేశం నిన్నటి రోజున ఎంతో ఆనందంగా.. ఈ వేడుకను జరుపుకుంది. ఈ క్రమంలో పొరుగు దేశం అయిన పాకిస్తాన్ మాత్రం అయోధ్యకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంది.

  • Published Jan 23, 2024 | 11:54 AMUpdated Jan 23, 2024 | 11:54 AM
Ayodhya: అయోధ్యపై పాక్‌ అక్కసు.. మందిర ప్రారంభోత్సవం వేళ కారు కూతలు!

రామ జన్మ భూమిలో దాదాపు కొన్ని శతాబ్దాల తర్వాత అందరి ముఖాల్లో ఆనందం కనిపించింది. ఎక్కడో అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట సంబరాలు జరిగితే.. ఆ సంబరాల సువాసన యావత్ భారతదేశం అంతటా వ్యాపించి.. అందరిలో ఆ ఉత్సాహాన్ని నింపింది. ఒక్కరోజులోనే అన్ని పండుగలు జరుపుకున్నంత ఘనంగా.. భారతీయులంతా ఈ ఆనందంలో మునిగి తేలారు. ఎటు చూసినా రాముల వారి రూపాలే అగుపించాయి. అయితే, కొన్ని కోట్ల మంది ప్రజలు.. అయోధ్య రామ మందిరం గురించి ఇంత ఆనందంగా ఉన్న సమయంలో.. పొరుగు దేశం ఆయిన పాకిస్తాన్ ఈ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనివ్వకుండా చేద్దాం అనుకుందో ఏమో.. ఎంతో మంది రామ మందిరం ప్రతిష్టాపన గురించి భావోద్వేగాలతో సామజిక మాధ్యమాలలో పోస్ట్స్ చేస్తుంటే.. పాక్ మాత్రం వాటి అన్నిటికి విరుద్ధంగా మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసింది.

మొదటినుంచి పాకిస్తాన్ కు.. భారతదేశానికి ఉన్న శత్రుత్వం గురించి అందరికి తెలిసిందే. భారతీయలు ఏం చేసినా దానికి పొరుగు దేశం విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అయోధ్య విషయంలోనూ అదే జరిగింది. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ రామ మందిర ప్రతిష్టాపన గురించి గొప్పగా సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో.. పాకిస్తాన్ బాబ్రీ మసీదు విషయాన్ని గుర్తు చేస్తూ.. తన వ్యతిరేక బుద్దిని ఓ ప్రకటన ద్వారా బయట పెట్టింది. ఈ ప్రకటనను ఆ దేశ అధికారులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ ప్రకటనలో ఏం ఉందంటే.. అయోధ్య నగరంలో ఇప్పుడు నిర్మించిన రామ మందిరం.. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థానంలో నిర్మించడాన్ని.. పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని.. ఓ ప్రకటన విడుదల చేసింది. అంతే కాకుండా బాబ్రీ మసీదు స్థానంలో ఉన్న రామ మందిరం.. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చలా మిగులుతుందని కూడా వెల్లడించింది. పైగా.. అటు వారణాసిలోను, మధురలోను కూడా మసీదులు, దర్గాలు పెరుగుతున్నాయని.. భారత్ లో నెలకొన్న ఈ రామ మందిరం అపవిత్రత, విధ్వంసం అంటూ పూర్తి వ్యతిరేక భావంతో ప్రకటనలు చేసింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు .. పాక్ పోస్ట్ కు తగినట్టుగా గట్టిగానే సరైన సమాధానాలు చెబుతున్నారు.

Pakistan's interest in Ayodhya

అలాగే భారత ప్రభుత్వం అన్ని రంగాలలోను ముస్లింలను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని నిందలు వేసింది. ఇలా భారతదేశం మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేసింది పాకిస్తాన్. అయితే, ఎప్పుడూ మైనారిటీ హింసలు, ఉగ్రవాదం, బలవంతపు మత మార్పిడి, మహిళల కిడ్నాప్, అత్యాచారాలు ఇలా తన చుట్టూ ఇన్ని జరుగుతున్నా.. వాటిని పట్టించుకోని పాకిస్తాన్.. భారతదేశ అంతర్గత విషయాల్లో తల దూర్చి.. సలహాలు సూచనలు ఇవ్వడం అందరికి విడ్డురంగా అనిపిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాలలో ఈ ప్రకటనను చుసిన నెటిజన్లు పాకిస్తాన్ పై మండిపడుతున్నారు. ఏదేమైనా.. సరిగ్గా యావత్ భారతీయులు ఎంతో సంతోషంగా రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో.. పాకిస్తాన్ ఆ విషయంపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం.. అందరికి ఆగ్రహం తెప్పించింది. మరి, అయోధ్య రామ మందిరం గురించి పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల గురించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి