iDreamPost

18 ఏళ్లకే రిటైరైన పాక్ మహిళా క్రికెటర్.. మిగిలిన జీవితం మతం కోసమే!

18 ఏళ్లకే రిటైరైన పాక్ మహిళా క్రికెటర్.. మిగిలిన జీవితం మతం కోసమే!

పాకిస్తాన్ మహిళా స్టార్ క్రికెటర్ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. ఆమె తీసుకున్న నిర్ణయం కేవలం పాక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. మిగిలిన జీవితం మొత్తం తన మతానికి అనుగుణంగా బతికుతానంటూ ప్రకటించింది.

ఆయేషా నసీమ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆమె తీసుకున్న నిర్ణయం గురించే మాట్లాడుకుంటోంది. 2020లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి.. 2023లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిటైర్మెంట్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. తన కెరీర్ లో ఇప్పటివరకు 33 టీ20లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడింది. టీ20ల్లో 369 పరుగులు చేయగా.. 3 వన్డేల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసింది. ఆమె టీ20 కెరీర్లో అత్యధిక స్కోరు భారత మహిళా జట్టుపైనే చేసింది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆయేషా నసీమ్ భారత్ పై 45 పరుగులు చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్ పై తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడింది. నసీమ్ కు బ్యాటింగ్ లో మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆమె మంచి హిట్టింగ్ చేయగల ప్లేయర్. అలాంటి ఆయేషా నసీమ్ ఉన్నట్లుండి క్రికెట్ కు వీడ్కోలు పలకడం పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. నసీమ్ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆమె అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. పాక్ మహిళా క్రికెట్ జట్టు ఒక బెస్ట్ హిట్టర్ ని కోల్పోయింది అంటున్నారు. మరి.. ఆయేషా నసీమ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పాక్ బోర్డు ఏమైనా పావులు కదుపుతుంమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి