iDreamPost

బ్రేకింగ్: పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం..భారత్​ చేరిన మూడ్రోజులకే..!

  • Author singhj Published - 01:09 PM, Sat - 30 September 23
  • Author singhj Published - 01:09 PM, Sat - 30 September 23
బ్రేకింగ్: పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం..భారత్​ చేరిన మూడ్రోజులకే..!

ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రపంచ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్​లో సందడి మొదలైంది. ఒక్కొక్కటిగా అన్ని జట్లు ప్రపంచ కప్ కోసం ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వార్మప్ మ్యాచ్ కూడా ఆడేశాయి. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో కివీస్ నెగ్గింది. ఇదిలా ఉంటే.. పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. షాదాబ్ మేనత్త కన్నుమూశారు. వరల్డ్ కప్​లో​ ఆడేందుకు భారత్​కు వచ్చిన షాదాబ్.. తన మేనత్త చనిపోయారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని, అందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను షాదాబ్ ఖాన్ కోరాడు. అయితే ఆమె ఎలా చనిపోయిందనే విషయాన్ని మాత్రం అతడు స్పష్టం చేయలేదు. షాదాబ్ ఇంట్లో విషాదం నెలకొనడంపై పాక్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అతడి మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రపంచ కప్​లో ఆడటం కోసం పాకిస్థాన్ జట్టు బుధవారం రాత్రి భారత్​కు చేరుకున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన దాయాది టీమ్​కు శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం లభించింది. పాక్ ప్లేయర్లను చూసేందుకు వందలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు.

హోటల్​లోనూ పాక్ క్రికెటర్లకు గ్రాండ్ వెల్​కమ్​ లభించింది. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెట్టింది దాయాది టీమ్. ఆ తర్వాత న్యూజిలాండ్​తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు హైదరాబాద్​లోనే ఉన్నారు. మెగా టోర్నీ ఫైనల్ నవంబర్ 19న జరగనుండగా.. నవంబర్ 12 వరకు లీగ్ మ్యాచ్​లు జరుగుతాయి. దీంతో అప్పటిదాకా పాక్ టీమ్​తోపాటు షాదాబ్ ఖాన్ కూడా ఇండియాలోనే ఉండే ఛాన్స్ ఉంది. హైదరాబాద్​కు చేరుకున్న కొన్ని గంటల్లోనే సిటీలో నిర్వహించిన వరల్డ్ కప్ ఈవెంట్​లో టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్​తో కలసి షాదాబ్ పాల్గొన్నాడు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో అతడ్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారు: యువరాజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి