iDreamPost

వరల్డ్ కప్ ముంగిట రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ బౌలర్!

  • Author Soma Sekhar Published - 12:09 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 12:09 PM, Mon - 4 September 23
వరల్డ్ కప్ ముంగిట రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ బౌలర్!

మరికొన్ని రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెరలేవబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రణాళికలను, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ స్టార్ బౌలర్ ఊహించని షాక్ ఇచ్చాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియపరిచాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్ బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు పాకిస్థాన్ వెంటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్. 2015 వరల్డ్ కప్ లో టీమిండియాపై 5 వికెట్లు తీయ్యడం ద్వారా అతడి పేరు మారుమ్రోగిపోయింది.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు పాకిస్థాన్ వెంటరన్ పేసర్ సోహైల్ ఖాన్. ఆదివారం ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్నిప్రకటించాడు ఈ బౌలర్. అయితే ఇంటర్నేషనల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్ బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. కాగా తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో మద్ధతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.

ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 2008లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. సోహైల్ తన కెరీర్ లో 9 టెస్టులు ఆడి 3.69 ఎకానమీతో 27 వికెట్లు, 13 వన్డేల్లో 19 వికెట్లు, 5 టీ20ల్లో 5 వికెట్లు తీసుకున్నాడు. కాగా.. టీమిండియాపై 2015 వరల్డ్ కప్ లో అతడు 5 వికెట్లు తియ్యడం ద్వారా.. అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆ తర్వాత సంవత్సరానికే అతడు పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. చివరిగా అతడు 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి