iDreamPost

పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది భార్యకు మంత్రి పదవి..

పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది భార్యకు మంత్రి పదవి..

పాకిస్థాన్.. ఏ  పని చేసిన.. తన అభివృద్ధి కంటే.. పక్క దేశాల నాశనం కోసమే చేస్తుంది. అక్కడ రాజకీయనేతలు కూడా భారత దేశాన్ని తిడుతు..తమ పభం గడుపుకుంటారు. అభివృద్ధి విషయాలు పక్కన పెట్టి.. ఉగ్రవాదాన్ని పెంచి..పోషిస్తుంటారు. అంతేకాక ఉగ్రవాదులకు ఆర్థికంగా అండదండలను పాక్ ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా పాక్ ప్రభుత్వంలో ఉగ్రవాది భార్యకు ఏకంగా మంత్రి పదవిని ఇచ్చారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోన్న సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో  అక్కడ పార్లమెంట్ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఉగ్రవాది భార్యకు మంత్రి పదవి ఇవ్వడం సంచలనంగా మారింది.

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జేకేఎల్ఎప్ చీఫ్ యాసిక్ మాలిక్ భార్య మిషాల్ హుస్సేన్ కు మాలిక్ ను చేర్చుకున్నారు.  కాశ్నీర్ ఏర్పాటు వాది అయినా యాసిన్ మాలిక్ తీవ్ర వాద నిధుల కేసుల్లో  ఎన్ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2022 మే 25న కోర్టు యాసీన్ కు జీవిత ఖైదు విధించింది. అలానే అతనిపై వివిధ కేసులు కూడా ఉన్నాయి. 2019వ సంవత్సరంలో జేకేఎల్ఎఫ్ ను నిషేధించారు. యాసీన్ మాలిక్ 2009లో ముషాల్ హుస్సేన్ మల్లిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాడు వివాహ వేడుకలకు పాకిస్థాన్‌లోని కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు.

అయితే తాజాగా యాసీన్ భార్య అయిని మిషాల్ హుస్సేన్ మాలిక్ ను పాక్ ప్రభుత్వం మంత్రిగా నియమించింది.  మానవ హక్కుల మంత్రిగా పాక్ ప్రభుత్వం నియమించింది. ఇలా ఒక ఉగ్రవాది భార్యకు  మంత్రి పదవి ఇవ్వడం బట్టి ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు భావించ వచ్చు. కొత్తగా నియమితుడైన తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్ తో పాటు మంత్రి వర్గ సభ్యులతో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ గురువారం ప్రమాణం చేయించారు. మరి.. ఇలా ఒక ఉగ్రవాది భార్యను మంత్రిగా ప్రమాణస్వీకరం చేయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌ గొప్ప నిర్ణయం.. వారి కోసం ఏకంగా రూ.100 కోట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి