iDreamPost

బకెట్లో పెయింటు – నామినేషన్లకు తొలిమెట్టు

బకెట్లో పెయింటు – నామినేషన్లకు తొలిమెట్టు

బిగ్ బాస్ 4 ఏడో వారంలో అడుగు పెట్టిన సందర్భంగా కొత్త నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. మొన్న కుమార్ సాయిని సాగనంపడంతో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలయ్యింది. అయితే గత కొద్దిరోజులుగా ఇస్తున్న టాస్కులు, పరిణామాలు కొంచెం తేడాగానే ఉన్నాయి. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ గుండు వ్యవహారం. మోనాల్ సేవ్ చేయడం కోసమే కుమార్ సాయిని తీసేసినట్టు ఆడియన్స్ లో అభిప్రాయం కలగడం లాంటివి చెప్పుకోవచ్చు. సరే ఇదంతా నిన్న గుర్తు పెట్టుకుని ఈ రోజు మర్చిపోయే వ్యవహారమే అయినా సోషల్ మీడియాలో మాత్రం వీటి పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాకే ఉంది. నిన్న సంగతి చూస్తే హారిక అవినాష్ ల మధ డ్రెస్సు గురించి సరదా సంభాషణ నడిచింది. పంచులు కూడా పడ్డాయి.

మోనాల్ తో మాట్లాడే విషయం గురించి అరియనా చేసిన రాయబారం అభిజిత్ దగ్గర వర్క్ అవుట్ అవ్వలేదు. అతను నోయెల్, లాస్య, హారికలతో దీని గురించే హాట్ డిస్కషన్ కూడా పెట్టాడు. ఈ క్రమంలో నోరు జారి సెన్సార్ పదాలు కూడా వాడేశాడు. మధ్యలో అరియనా చులకన కావడం మిగిలినవాళ్లు ఎంజాయ్ చేశారు. ఇక అమీ తుమీ టాస్క్ డీల్ మళ్ళీ వచ్చింది. నోయెల్, అమ్మ రాజశేఖర్ లు ఆల్రెడీ సేవ్ అయ్యారు కాబట్టి ఇతర సభ్యులకు కాంటెస్ట్ పెట్టాడు బిగ్ బాస్. అందులో భాగంగా బాలన్స్ ఉన్న 10 మంది ఐదు జంటలుగా విడిపోవాలి. స్టాండ్స్ దగ్గరకు ఎవరు సేవ్ కావాలి ఎవరు నామినేట్ కావాలో నిర్ణయించుకోవాలని ఎవరినైతే పంపాలనుకున్నారో వాళ్లపై బకెట్ లోని పెయింట్ ను కుమ్మరించాలని చెప్పాడు

అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక, అవినాష్-సోహైల్, లాస్య-దివి, మెహబూబ్-అరియనాలు కపుల్స్ గా మారారు. ఇందులో డ్రామాపాళ్ళు బాగా శృతిమించింది. ముఖ్యంగా అఖిల్ మోనాల్ ల మధ్య నాటకం మాములుగా పండలేదు. ఫైనల్ గా మోనాల్ పెయింట్ వేయించుకుంది. అవినాష్ సోహైల్ లు చాలా సేపు వాదించుకుని విసుగు తెప్పించారు. ఫైనల్ గా బిగ్ బాస్ హెచ్చరికతో అవినాష్ బకరా ఐయ్యాడు. ఇక అభిజిత్ హారికలు మేమేం తక్కువ తిన్నామా అనే రేంజ్ లో నటనమాడి ఫైనల్ గా అభిజిత్ ఫిక్సయ్యాడు. లాస్యను కాపాడేందుకు దివి బలయ్యింది. అరియనా మెహబూబ్ లు చాలా సేపు రచ్చ చేసి ఫైనల్ గా ఆమెనే త్యాగం చేసింది. మొత్తానికి అవసరానికి మించి సాగతీతతో నామినేషన్లు పూర్తయ్యాయి. మరి ఇవాళ్టి నుంచి ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి