iDreamPost

OTTలో లేడీ డాన్.. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలే గాడ్ మదర్.. చూశారా?

OTT Suggestions: ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ లలో చాలా అరుదుగా అద్భుతంగా ఉందే అనే బావన కలుగుతుంది. అలాంటి వాటిలో ఈ సిరీస్ తప్పకుండా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సిరీస్ ని మిస్ చేయద్దు.

OTT Suggestions: ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ లలో చాలా అరుదుగా అద్భుతంగా ఉందే అనే బావన కలుగుతుంది. అలాంటి వాటిలో ఈ సిరీస్ తప్పకుండా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సిరీస్ ని మిస్ చేయద్దు.

OTTలో లేడీ డాన్.. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలే గాడ్ మదర్.. చూశారా?

ఓటీటీలో కొన్ని సినిమాలు నవ్విస్తాయి, మరికొన్ని సినిమాలు ఏడిపిస్తాయి. కానీ, చాలా అరుదుగా ఇది కదా సినిమా అనే భావనను కలిగిస్తాయి. అలాగే వెబ్ సిరీస్లు కూడా కొన్ని ఉంటాయి. చూస్తున్నంతసేపు మన ఆసక్తిని, మన దృష్టిని పక్కకు మరల్చనివ్వవు. స్టార్ట్ చేస్తే ఎండ్ చేసే వరకు మనసు ఊరుకోదు. అలాంటి కోవలోకి ఈ వెబ్ సిరీస్ కూడా చేరుతుంది. ఈ సిరీస్ మొత్తం మీకు గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. టేకింగ్ కావచ్చు, స్టోరీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతి ఒక్క అంశం ఆడియన్ ని మంత్ర ముగ్దులను చేస్తుంది. మరి ఆ సిరీస్ ఏది? ఎక్కడ చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.

సాధారణంగా లేడీ ఓరియంట్ సినిమాలు, స్టోరీలు తెరకెక్కించాలి అంటే చాలా కష్టపడాలి. ఎక్కడా కూడా క్యారెక్టర్ ని తగ్గించడానికి ఆస్కారం ఉండకూడదు. నిజానికి హీరో సెంట్రిక్ స్టోరీల కంటే హీరోయిన్ ఓరియంటెడ స్టోరీలపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. కన్విన్సింగ్ గా చూపించడానికి. ఈ వెబ్ సిరీస్ మీద డైరెక్టర్ గట్టిగానే శ్రద్ధ పెట్టారు. ఎక్కడా కూడా ఆ లేడీ డాన్ పాత్రను తగ్గించరు. ప్రతి సీన్ లో ప్రతి షాట్ లో ప్రతి రిఫరెన్స్ లో ఆ క్యారెక్టర్ ని లేపుతూనే ఉంటారు. గాడ్ ఫాదర్ లాగా.. ఆమె గాడ్ మదర్ గా మారిపోతుంది. పురాషాధిక్య సమాజంలో ఒక స్త్రీ లేడీ డాన్ గా ఎదిగే తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. తాను పడిన కష్టాలను తన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకుంటుంది. ఒక గుంపు మధ్యకు వెళ్లి వారికి రాణిలా నెత్తినెక్కి కూర్చుంటుంది.

మాదకద్రవ్యాల మహా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా మారిపోతుంది. ఎదురు ఎంతటి వాడు ఉన్నా తల తెంచడమే గానీ.. తల వంచడం తెలియని ఒక హీరోయిక్ క్యారెక్టర్ ఇది. ఇంత హైప్ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు ‘గ్రిసెల్డా’. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది జనవరి 25, 2024లోనే రిలీజ్ అయ్యింది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 49 నిమిషాల నుంచి 59 నిమిషాల వరకు ఉంటాయి. మొదటి నాలుగు ఎపిసోడ్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చివరి రెండు ఎపిసోడ్స్ కాస్త తగ్గాయి అనే భావన కలగచ్చు. కానీ, సిరీస్ మాత్రం తప్పకుండా చూడాల్సిన లిస్ట్ లోనే ఉంటుంది.

కథ ఏంటంటే?:

అసలు ఇందులో కథ ఏటంటేం.. గ్రిసెల్డా బ్లాన్కోను భర్త వదిలేస్తాడు. ఆమెకు ముగ్గురు కొడుకులు ఉంటారు. తన భర్త నుంచి విడిపోయి మయామీలో డ్రగ్స్ సామ్యాజ్యాన్ని ఏలే డాన్ గా మారిపోతుంది. ఆ తర్వాత ఆమెకు వ్యతిరేకంగా చాలామంది పనిచేస్తారు. తన నిర్ణయాలు, పోకడల వల్ల చాలానే రక్తపాతం జరుగుతుంది. ఆమె ఎదుగుదల, ఆమె పతనం రెండింటిని ఈ సిరీస్ లో చూపించారు. కానీ, ఒక స్త్రీ చీకటి సామ్యాజ్యానికి అధిపతి అయితే ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో మెయిన్ లీడ్ సోఫియా వెర్గరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె గ్రిసెల్డా పాత్రను అద్భుతంగా పోషించింది. మరి.. గ్రిసెల్డా సిరీస్ చూస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి