iDreamPost

ఒక్కరోజే ఓటీటీలో రిలీజ్ కానున్న 18 మూవీస్.. ఆ రెండు మాత్రం!

  • Author singhj Published - 03:38 PM, Thu - 3 August 23
  • Author singhj Published - 03:38 PM, Thu - 3 August 23
ఒక్కరోజే ఓటీటీలో రిలీజ్ కానున్న 18 మూవీస్.. ఆ రెండు మాత్రం!

టాలీవుడ్కు జులై నెల బాగా కలిసొచ్చింది. ఈ నెలలో రిలీజైన ‘సామజవరగమన’, బేబీ’ లాంటి చిన్న చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. లో బడ్జెట్​లో తెరకెక్కిన ఈ మూవీస్.. డబుల్ బ్లాక్​ బస్టర్స్​గా నిలవడం విశేషమనే చెప్పాలి. ముఖ్యంగా ‘బేబీ’ అయితే ఎవరి అంచనాలకు అందని రీతిలో సంచలన వసూళ్లతో ట్రేడ్ పండితులను కూడా షాక్​కు గురిచేసింది. గత నెల చివరి వారంలో రిలీజైన పవన్ కల్యాణ్ మూవీ ‘బ్రో’ కూడా మొదటి మూడ్రోజులు మంచి కలెక్షన్స్​ రాబట్టింది. కానీ సోమవారం నుంచి ఆ చిత్రం వసూళ్లు భారీగా పడిపోయాయని సమాచారం. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు.

వచ్చే వారం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’, మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ‘భోళా శంకర్’ రిలీజ్ అవుతుండటంతో ఈ వీక్ చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కాగా.. వాటిల్లో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని నిర్మించిన ‘ఎల్​జీఎమ్​’ ఒక్కటే చెప్పుకోదగ్గ మూవీ. దీంతో సినీ ప్రియులు అందరూ ఓటీటీల వైపు చూస్తున్నారు. వారి కోసమే అన్నట్లు ఈసారి సుమారుగా 18 కొత్త సినిమాలు, వెబ్​ సిరీస్​లు రిలీజ్​కు రెడీ అయిపోయాయి. ఈ లిస్టులో ఉన్న మూవీస్​లో స్ట్రీమింగ్ అవుతున్నవి గురువారం విడుదల అవుతున్నాయి. మిగతావన్నీ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇందులో ‘పరేషాన్’తో పాటు ‘దయ’ వెబ్ సిరీస్ ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు/వెబ్​ సిరీస్​లు


నెట్​ఫ్లిక్స్

రంగబలి – తెలుగు చిత్రం
చూనా – హిందీ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్
ద హంట్ ఫర్ వీరప్పన్ – హిందీ సిరీస్
ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్
హెడ్ టూ హెడ్ – అరబిక్ చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయెండో – స్పానిష్ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2: ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
హార్ట్ స్టాపర్ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెండీ స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హార్ట్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్

హాట్​స్టార్
దయ – తెలుగు వెబ్ సిరీస్

సైనా ప్లే
డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ – మలయాళం మూవీ

ఆహా
హైవే – తమిళ చిత్రం

బుక్​ మై షో
టూ క్యాచ్ కిల్లర్ – ఇంగ్లీష్ ఫిల్మ్
సైలెంట్ హవర్స్ – ఆంగ్ల చిత్రం
లాస్ట్ అండ్ ఫౌండ్ – ఇంగ్లీష్ మూవీ

సోనీ లివ్
పరేషాన్ – తెలుగు చిత్రం
ఫటాఫటీ – బెంగాల్ ఫిల్మ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి