iDreamPost

సినిమాను టీవీ మించుతోంది

సినిమాను టీవీ మించుతోంది

ఆర్టిస్టులకు సినిమాలు రావడం లేదనో లేక టీవీ సీరియల్స్ చేయలేక ఇబ్బంది పడటమో ఇకపై తగ్గనుంది. కెరీర్ పరంగా వయసుతో సంబంధం లేకుండా ఆప్షన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అనేది వరంగా మారుతోంది. షూటింగ్ పరంగా కాల్ షీట్స్ ఎక్కువగా అవసరం అవుతున్నప్పటికీ రెమ్యునరేషన్లు కూడా దానికి తగ్గట్టు బాగా గిట్టుబాటు అయ్యేలా సదరు సంస్థలు ముట్టజెబుతూ ఉండటంతో ఒక్కొక్కరుగా మెల్లగా ఓటిటిల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి కంపెనీలు సరైన క్యాస్టింగ్ కాంబినేషన్లు దొరకాలే కానీ సినిమాను మించిన బడ్జెట్లను పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.

అందులోనూ యంగ్ ఫిలిం మేకర్స్ కి ఇప్పుడు ఇండస్ట్రీలో అంత ఈజీగా నిర్మాతలు దొరకడం లేదు. దాని బదులు మంచి స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేస్తే చాలు కొన్ని ఓటిటిలు పూర్తి బడ్జెట్ పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇప్పుడు తమన్నానే ఉదాహరణగా తీసుకుంటే ఆహా, హాట్ స్టార్ లో సిరీస్ లు చేసిన తను నెక్స్ట్ ప్రైమ్ కు సంతకం చేసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ ఓకే చేయించుకున్నారట. కాజల్ అగర్వాల్ కు కు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. సాయి పల్లవి గతంలో ఒక అంథాలజిలో నటించింది. సూర్య లాంటి హీరోలూ తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు.

ఒకరకంగా చూస్తే ఈ ఓటిటిలు భవిష్యత్తు ఎంటర్ టైన్మెంట్ రంగంలో కీలక పాత్ర పోషించడం ఖాయమే అనిపిస్తోంది. థియేటర్ కి ఇది ఎప్పటికీ ఆల్టర్ నేటివ్ కానప్పటికీ మారుతున్న జనాల అభిరుచి కోణంలో చూస్తే ప్రతి సినిమాకు పబ్లిక్ రిస్క్ తీసుకుని హాలు దాకా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. దానికి తోడు ఇంకా ఆరేడు నెలలు కరోనా భయం ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు సైతం రిలీజ్ డేట్లను చెప్పేందుకు జంకుతున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ ఓటిటిలో నటీనటులకే కాదు ప్రేక్షకులకు సంబంధించి కూడా కొత్త ట్రెండ్ సృష్టించేలా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి