iDreamPost

ఇంట్రోవర్ట్ ని చీట్ చేస్తే ఇంత వైలెంట్ అవుతాడా? OTTలో తప్పక చూడాల్సిందే!

Crime Thriller OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. వాటిలో ఏది చూడాలో ఎవరికీ క్లారిటీ ఉండదు. ఒకసారి ఈ సినిమా ట్రై చేయండి.

Crime Thriller OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. వాటిలో ఏది చూడాలో ఎవరికీ క్లారిటీ ఉండదు. ఒకసారి ఈ సినిమా ట్రై చేయండి.

ఇంట్రోవర్ట్ ని చీట్ చేస్తే ఇంత వైలెంట్ అవుతాడా? OTTలో తప్పక చూడాల్సిందే!

ఓటీటీలో రోజుకు ఒక సినిమా చూడటం ఇప్పుడు చాలామందికి హాబీగా మారిపోయింది. రోజుకో సినిమా చూసినా ఓటీటీలో ఇంకా చాలానే సినిమాలు, సిరీస్లు ఉంటాయి. కానీ, రోజూ ఒక సినిమా అంటే ప్రతిసారి బెస్ట్ మూవీస్ దొరక్కపోవచ్చు. పైగా అంతా చూసిన తర్వాత అది అంతగా నచ్చకపోతే టైమ్ వేస్ట్ చేశామనే భావన కలుగుతుంది. అందుకే మీరు ఏ మూవీ పడితే ఆ మూవీ చూడకుండా మంచి సినిమాలే చూసేలా.. మేము మీకు బెస్ట్ మూవీస్ సజెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఈసారి కూడా ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ డ్రామాతో మీ ముందుకు వచ్చాం. ఈ సినిమా చూశాక.. ఇది కదా మూవీ అంటే అనే భావన మీకు కలగకుండా ఉండదు.

ఇంత హైప్ ఇస్తోంది.. ఇంత నమ్మకంగా చెబుతోంది.. ఒక బాలీవుడ్ సినిమా గురించి. ఆ మూవీ పేరే ఫ్రెడ్డీ. ఇది డిస్నీప్లస్ హాట్ స్టార్ లో 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కాకపోతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. భాష రాదు కదా అని మూవీ చూడకపోతే ఒక మంచి క్రైమ్ డ్రామా మిస్ అయినవాళ్లు అవుతారు. ఈ మూవీ దాదాపుగా అందరికీ నచ్చేస్తుంది. అయితే 16+ వాళ్లు మాత్రమే చూడాలి అని సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ సినిమా ఎంతో మందికి నచ్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఒక ఇంట్రోవర్ట్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమా.

హీరో తన మనసులో ఉన్నది పైకి చెప్పలేకపోవడం, ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని తన అభిప్రాయాలను తనలోనే దాచుకోవడం చేస్తుంటాడు. ఈ మూవీ ఎంతో సింపుల్ గా సాగిపోతూ ఉంటుంది. పర్వేజ్ షేక్ ఎంతో పకడ్బందీగా రాసుకున్న కథను.. శశాంక గోష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. కార్తిక్ ఆర్యన్, అలయా నటన అయితే నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా కార్తిక్ ఆర్యన్ ఒక ఇంట్రోవర్ట్ గా అందరినీ మెప్పిస్తాడు. పెళ్లి కోసం తాపత్రయ పడే ఒక అమాయకుడైన డెంటిస్ట్ గా.. చీట్ చేశారని రివేంజ్ కోసం రగిలిపోయే పాత్రలో కూడా ఒదిగిపోయాడు. ఇంక అలయా కూడా ఒక చీటింగ్ గార్ల్ గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

కథ ఏంటంటే?:

ఫ్రెడీ జిన్ వాలా(కార్తిక్ ఆర్యన్) ఒక ఇంట్రోవర్ట్. వృత్తి పరంగా అతను ఒక డెంటిస్ట్. వయసు మీద పడుతున్నా కూడా ఇంకా పెళ్లి కాదు. ఒక మంచి అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతను ఇంట్రోవర్ట్ కావడం, కాస్త అవుటాఫ్ ఫ్యాషన్ తో ఉండటంతో.. వచ్చే ఏ సంబంధం కూడా సెట్ కాదు. అలాగే నైరాశ్యంతో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అతని క్లినిక్ కి ఓరోజు ఒక పెళ్లైన మహిళ(అలయా) వస్తుంది. ఆమెను ట్రీట్ చేస్తూ ఆమె ఒంటిపై గాయాలు గమనిస్తాడు. ఆమె పరిస్థితి చూసి ఫ్రెడ్డీ జాలి పడతాడు. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారుతుంది.

ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి అనుకుంటారు. కానీ, అందుకు ఆమె భర్త అడ్డుగా ఉంటాడని భావిస్తారు. ఎలాగైనా భర్తను హత్య చేయాలి అని ఫిక్స్ అవుతాడు. తాను అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు. కానీ, ఆ తర్వాతే అసలు విషయం తెలుసుకుంటాడు. ఆ ట్విస్టుకు ప్రేక్షకుల బుర్ర గిర్రున తిరిగిపోతుంది. మరి.. ఫ్రెడ్డీ- కైనాజ్ వివాహం జరిగిందా? ఫ్రెడ్డీ ఎందుకు వైలెంట్ గా మారతాడు. అసలు కైనాజ్(అలయా) అతని లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? చివరకు ఏం జరిగింది అనేది కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా చూసి సమాధానాలు తెలుసుకోవాల్సింది. మరి.. ఫ్రెడ్డీ సినిమా ఇప్పటికే చూస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి