iDreamPost

Ooru Peru Bhairavakona: OTTలోకి ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’.. అందులోనే స్ట్రీమింగ్!

  • Published Feb 17, 2024 | 10:43 AMUpdated Feb 17, 2024 | 10:43 AM

యంగ్ హీరో సందీప్ కిషన్ యాక్ట్ చేసిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిర్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ హీరో సందీప్ కిషన్ యాక్ట్ చేసిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిర్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 17, 2024 | 10:43 AMUpdated Feb 17, 2024 | 10:43 AM
Ooru Peru Bhairavakona: OTTలోకి ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’.. అందులోనే స్ట్రీమింగ్!

కొత్త సినిమాల థియేటర్ రిలీజ్​కు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతే డిమాండ్ ఓటీటీ విడుదలకు కూడా ఉంటుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్స్​లో హిట్టయిన మూవీస్​కు ఓటీటీలో నెక్స్ట్ లెవల్లో క్రేజ్ ఉంటుంది. అందుకే అలాంటి చిత్రాలను సాధ్యమైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక, యంగ్ హీరో సందీప్ కిషన్ యాక్ట్ చేసిన కొత్త సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. రీసెంట్​గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హారర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ఈ ఫిల్మ్ మిక్స్​డ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ అంత అట్రాక్టివ్​గా లేదని వినిపించింది. అయితే హారర్, సస్పెన్స్ ఎలిమెంట్​తో పాటు వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. అలాంటి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మారింది. ప్రస్తుతం నడుస్తున్న బజ్ ప్రకారం.. సందీప్ కిషన్ కొత్త చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేటర్ రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని జీ5తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే సినిమా మీద వచ్చే టాక్, బాక్సాఫీస్ వసూళ్ల ప్రకారం ఒక్కోసారి అనుకున్న దాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారనే విషయం తెలిసిందే. ఆ లెక్కన ‘ఊరు పేరు భైరవకోన’ను రెండు నెలలు లేదా 45 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేస్తారని వినికిడి. కలెక్షన్స్, టాక్ ద్వారా స్ట్రీమింగ్ డేట్​లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ‘ఊరు పేరు భైరవకోన’ స్ట్రీమింగ్, ఓటీటీ పార్ట్​నర్​పై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీని మీద త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Fantasy adventure film 'Uru Parama Bhairavakona' hits OTT

‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీ హక్కులను జీ5 మాత్రమే కాకుండా ఆహా సంస్థ కూడా దక్కించుకుందని మరో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకు చెప్పలేం. ఇక, ‘ఊరు పేరు భైరవకోన’ మూవీని ప్రముఖ దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించారు. ఆయన ఇది వరకే సందీప్ కిషన్​తో ‘టైగర్’ అనే ఫిల్మ్​ను తీశారు. అలాగే మరో యంగ్ హీరో నిఖిల్​తో ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ చిత్రాన్ని తీశారు. ఇందులో ‘టైగర్’ యావరేజ్​గా నిలవగా.. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ సూపర్​హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్షన్​లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాను మీరు చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్‌, నగలు చోరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి