iDreamPost

ఆ ఊరిలో ఒకటే కుటుంబం! కారణం ఏంటంటే..

సాధారణంగా గ్రామం అంటే అనేక కుటుంబాల కలయికా. అయితే ఒక్కే కుటుంబం ఉండే గ్రామం ఎక్కడైనా ఉంటుందా?. అసలు అలా ఉండేందు ఎవరైనా సిద్ధంగా ఉంటారా?. కానీ ఓ గ్రామంలో ఒక్కే కుటుంబం ఉండి.. తాజాగా వార్తల్లో నిలిచింది.

సాధారణంగా గ్రామం అంటే అనేక కుటుంబాల కలయికా. అయితే ఒక్కే కుటుంబం ఉండే గ్రామం ఎక్కడైనా ఉంటుందా?. అసలు అలా ఉండేందు ఎవరైనా సిద్ధంగా ఉంటారా?. కానీ ఓ గ్రామంలో ఒక్కే కుటుంబం ఉండి.. తాజాగా వార్తల్లో నిలిచింది.

ఆ ఊరిలో ఒకటే కుటుంబం! కారణం ఏంటంటే..

మనకు సమాజంలో అనేక వింతలు  కనిపిస్తుంటాయి. అంతేకాక కొన్ని  ప్రదేశాలకు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొందరు వ్యక్తులు ఏళ్ల తరబడి ఒంటరిగా గుహలు, అడవుల్లో జీవించడం వంటి ఘటనలు  అనేకం జరిగాయి. అయితే ఇలా జరిగే ప్రతి ఒక విభిన్నమైన ఘటన, పని వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. అది తెలిసిన తరువాత మనదరం షాక్ అవ్వాల్సిందే. అలానే ఒక ఊరు.. ఆ ఊరిలో ఒక్కే కుటుంబం నివాసం ఉంటుంది. ఊరుంటే.. గ్రామాలు ఎక్కువ కుటుంబాలు ఉండాలి కదా.. అని సందేహం రావచ్చు. కానీ అక్కడ మాత్రం ఒక్కే కుటుంబం ఉంది. మరి..అలా ఉండటానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్ర మేల్ ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామం ఉంది. ఈ ఊరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం.. ఈ ఊరిలో కేవలం ఒక్కే ఒక్క కుటుంబం మాత్రమే ఉంది. భోగిలాల్ భాయిట్కర్ అనే వ్యక్తి కుటుబం మాత్రమే పిలీ గ్రామంలో నివాసం ఉంటుంది. మరి.. ఆ కుటుంబమే ఊరిలో ఏళ్ల తరబడి ఉంటుందా అంటే.. కానే కాదు.. గతంలో ఈ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసించేవి. రెండు దశాబ్దాల క్రితం మేల్ ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ను అదికారులు చేపట్టారు.

ఆ క్రమంలోనే సుమారు 37 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలి. అంతేకాక వారికి వేరే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పటికే 17 గ్రామాలను తరలించగా, మరో ఆరు గ్రామాల ప్రజలను తరలించే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే 2021లో పిలీ గ్రామంలోని  సుమారు 500 కుటుంబాలు కూడా 2021లో ఖాళీ చేసి వెళ్లిపోయాయి.అయితే బలవంతంగా ఖాళీ చేయించాలనే నిబంధన లేనందున అధికారులు ఆ గ్రామ ప్రజల ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.

అయితే ప్రభుత్వం జారీ చేసిన నోటీసులతో అందరూ వెళ్లిపోగా, భోగిలాల్ భాయిట్కర్ అనే వ్యక్తి కుటుంబం మాత్రం పిలీ గ్రామంలోనే నివసిస్తోంది. అయనతో పాటు భార్య, పిల్లలు… అందరూ కలిపి ఆరుగురు ఉంటారు. మరి.. మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకు ఉన్నారని భోగిలాల్ ను ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు తెలిపారు. తనకు అక్కడ 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అంతేకాక పెద్ద ఇల్లు ఉందని, 8 ఆవులు, 15-20 కోళ్లు ఉన్నాయని తెలిపాడు. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నానని భోగిలాల్ చెప్పుకొచ్చారు.

తన పెద్ద కుమారుడు వివాహం కూడా జరిగిందని, అతడు భార్యతో కలిపి వారితో పాటే ఉంటున్నారని తెలిపారు. మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారిని తానే బైక్‌పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని పాఠశాలలో దించేసి వస్తాను. అయితే వ్యవసాయ భూమికి, తన ఇంటికి సమానమైన ధర చెల్లిస్తే ఆ గ్రామం నుంచి వెళ్లేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని భోగిలాల్ తెలిపారు. అయితే ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు ఇస్తుందని, ఆ డబ్బుతో నేను ఏం చేసుకోవాలని భోగిలాల్‌ భాయిట్కర్‌ ప్రశ్నిస్తున్నారు. మరి.. ఇప్పుడు భోగిలాల్.. ఆ గ్రామంలో ఉంటూ వార్తల్లో నిలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి