iDreamPost

5,089 టీచర్ ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తులు

5,089 టీచర్ ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తులు

ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించిన విషయం తెలిసిందే. 5089 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పూర్తి వివరాలతో విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసుకుని టెట్ క్వాలిఫై అయిన లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీచర్ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక టీచర్ ఉద్యోగాలకు నేటి నుంచే(సెప్టెంబర్) ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు అధికారులు.

కాగా టీచర్ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన కొత్త రోస్టర్ ను విడుదల చేసిన విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టుల్లో ఈ సారి 51 శాతం ఉద్యోగాలు మహిళలకే దక్కనున్నాయి. టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకును అభ్యర్థులకు కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 44 ఏళ్లుగా నిర్ణయించారు. టీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వయసు సడలింపు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి మూడేళ్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్య్లూఎస్ కోటా అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం

మొత్తం పోస్టులు: 5089

స్కూల్ అసిస్టెంట్: 1739

లాంగ్వేజ్ పండిట్: 611

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 164

సెకండరీ గ్రేడ్ టీచర్: 2575

దరఖాస్తు ఫీజు: 1000

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తులు ప్రారంభం: 20-09- 2023

దరఖాస్తులకు చివరి తేదీ: 21-10-2023

ఆన్ లైన్ పరీక్ష: నవంబర్ 20 నుంచి 30 వరకు

అధికారిక వెబ్ సైట్: https://schooledu.telangana.gov.in/ISMS/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి