iDreamPost

టెన్త్, ITI పాసయ్యారా?.. రైల్వేలో 1646 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

మీరు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులయ్యారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 1646 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులయ్యారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 1646 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

టెన్త్, ITI పాసయ్యారా?.. రైల్వేలో 1646 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటి. దేశంలో రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది ఇండియన్ రైల్వేస్. కాగా రైల్వే సేవల్లో ఏమాత్రం అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు రైల్వే శాఖ భర్తీ చేస్తూ ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జైపూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు టెన్త్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1646 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను https://rrcjaipur.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటిస్ ఖాళీలు:

1646

డివిజన్ల వారీగా ఖాళీలు:

డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, అజ్మేర్:

  • 402

డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, బికనీర్:

  • 424

డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జైపూర్‌ డివిజన్:

  • 488

డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జోధ్‌పూర్ డివిజన్:

  • 67

బీటీసీ క్యారేజ్, అజ్మేర్:

  • 113

బీటీసీ లోకో, అజ్‌మేర్:

  • 56

క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్:

  • 29

క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్:

  • 67

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 50% మార్కులతో టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 10.02.2024 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

  • పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 10-01-2024.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 10-02-2024.

నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్:

https://rrcjaipur.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి