iDreamPost

రోజుకొక యాపిల్ తినండి డాక్టర్‌ని దూరంగా ఉంచండి.. నిజమేనా?

రోజుకొక యాపిల్ తినండి డాక్టర్‌ని దూరంగా ఉంచండి.. నిజమేనా?

“one apple a day keeps the doctor away”.. రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని అంటారు. అది నిజమే కూడా. రోజూ ఒక ఆపిల్ తింటే మన ఆరోగ్యానికి కచ్చితంగా మంచిదే. ఆపిల్ ని తొక్కతో తినొచ్చు లేదా తొక్క తీసి కూడా తినొచ్చు. ఇటీవల యాపిల్స్ మెరవడానికి పైన మైనం పూత పూస్తున్నారు కాబట్టి తొక్కతో తినాలనుకుంటే శుభ్రంగా కడిగి తినాలి.

ఆపిల్ ను చిన్న పిల్లలు అంటే ఆరు నెలల వయసు ఉన్న పిల్లలకు కూడా ఉడికించి తినిపించవచ్చు. ఆపిల్ తొక్కతో పాటు తింటే అది ఊపిరితిత్తులను అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆపిల్ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కర, కోలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. మధుమేహం, మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం ఉన్నవారికి ఆపిల్ తొక్క బాగా ఉపయోగపడుతుంది.

ఆపిల్ లో విటమిన్ ఎ, బి, కే మరియు సి ఉన్నాయి. ఆపిల్ లో ఉండే ఫైబర్ రోగాలు రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గడానికి ఆపిల్ సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఆపిల్ ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఆపిల్ తోడ్పడుతుంది. ఆపిల్ రోజూ తినడం వలన మెదడుకు సంభందించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆస్తమాతో భాధపడేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు వారికి కూడా ఆపిల్ ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు అన్ని కాలాల్లో దొరికే ఆపిల్స్ ని రోజూ ఒకటి తింటే నిజంగానే డాక్టర కి దూరంగా ఉండి హాస్పిటల్ కి వెళ్లాల్సిన పని ఉండదు. కచ్చితంగా మీరు రోజుకి ఒక యాపిల్ తినండి, మీ పిల్లలకి కూడా తినిపించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి