iDreamPost

ఓలా బంపరాఫర్.. నెలకు రూ. 70 వేలు సంపాదించుకునే ఛాన్స్

ఓలా ద్వారా రైడర్లు నెలకు సుమారు 30వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఈ సంపాధనను రెట్టింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఓలా. దీనికోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని తీసుకొచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 70 వేల ఆదాయాన్ని పొందొచ్చని ఓలా తెలిపింది.

ఓలా ద్వారా రైడర్లు నెలకు సుమారు 30వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఈ సంపాధనను రెట్టింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఓలా. దీనికోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని తీసుకొచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 70 వేల ఆదాయాన్ని పొందొచ్చని ఓలా తెలిపింది.

ఓలా బంపరాఫర్.. నెలకు రూ. 70 వేలు సంపాదించుకునే ఛాన్స్

రవాణా రంగంలో బైక్ ట్యాక్సీల హవా కొనసాగుతోంది. ప్రయాణికులు కూడా బైక్ ట్యాక్సీలవైపే మొగ్గుచూపుతున్నారు. కాస్త ఛార్జీలు ఎక్కువైనప్పటికీ, ఉన్నచోటుకే బైక్ రావడం, సమయం ఆదా అవడం వంటి కారణాలతో బైక్ ట్యాక్సీలకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు డ్రైవర్ వృత్తిపై ఆదారపడిన వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నాయి బైక్ ట్యాక్సీ కంపెనీలు. తమ టూ వీలర్, కార్, ఆటో లను కంపెనీలతో అటాచ్ చేసుకుని ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా రైడర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఓలా వెల్లడించింది.

ఓలా ద్వారా రైడర్లు నెలకు సుమారు 30వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఈ సంపాధనను రెట్టింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఓలా. దీనికోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని తీసుకొచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 70 వేల ఆదాయాన్ని పొందొచ్చని ఓలా తెలిపింది. అయితే ముందుగా ఓలా ఎస్1 ఎలక్ట్రిక్‌ బైక్ ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటదని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. కాగా ముందుగా బెంగళూరు రైడర్లకు ఈ అవకాశాన్ని కల్పించారు. రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్‌ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ వివరాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వాలి.

ఓలా ప్రత్యేక చెల్లింపులు ఇవే:

బెంగళూరులోని బైక్‌ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్‌ కంప్లీట్ చేసిన రైడర్ కు ఇన్సెంటీవ్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్‌ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్‌ కంప్లీట్ చేసిన రైడర్ కు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు ఆదాయం పొందొచ్చు. అందులో రెంటల్‌ అమౌంట్‌ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 నుంచి 30 బుకింగ్‌లు కంప్లీట్ చేసిన రైడర్ లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో, డ్రైవర్‌లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే ఇన్సెంటీవ్ కు అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ఓలా చెల్లించే ఈ చెల్లింపుల ద్వారా రైడర్లు రూ. 70 వేలు సంపాదించుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి