iDreamPost

వలస కూలీలపై అధికారుల దురుసు ప్రవర్తన…

వలస కూలీలపై అధికారుల దురుసు ప్రవర్తన…

కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో వలస కూలీల కష్టాలు పెరిగాయి. దేశంలో రవాణా సౌకర్యాలను రద్దు చేయడంతో స్వస్థలాలకు చేరుకోవడానికి వలస కూలీలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొందరు కాలినడకన స్వస్థలాలకు చేరుకుంటున్నారు.. అలాంటి వారిపై కొందరు అధికారులు దురుసుగా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై అధికారులు రోడ్డుపై ఉంచి కెమికల్స్‌ స్ప్రే చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సొంత ఊళ్లకు చేరుకోవాలని బరేలీ జిల్లాకు చేరుకున్న వలస కూలీలను రోడ్డుపై కూర్చోబెట్టి కెమికల్స్ ని స్ప్రే చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఈ వీడియో గురించి జిల్లా మెజిస్ట్రేట్ స్పందిస్తూ ‘‘ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నారు. సీఎంవో పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్‌, ఫైర్‌ బిగ్రేడ్‌ వారికి బస్సులను శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ట్విట్టర్లో వెల్లడించారు..

కాగా ఈ వీడియో బయటకు రావడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు పోలీసులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న పలు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే క్లోరిన్‌ను నీటితో కలిపి స్ప్రే చేశామని, అమానవీయంగా ప్రవర్తించలేదని తెలిపారు. వలస కూలీలు ఎక్కువగా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తుండటంతో, ప్రతి ఒక్కరిని ఒకేసారి పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో ఇలా క్లోరిన్ నీటిని స్ప్రే చేశామని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి