iDreamPost

రైలు కింద చిక్కుకొని ఏకంగా 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. చివరికి ఏమైందంటే?

ఓ బాలుడు రైలు కింద చిక్కుకుని ఏకంగా 100 కి.మీలు ప్రయాణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పోడిచే ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. చివరికి ఏమైందంటే?

ఓ బాలుడు రైలు కింద చిక్కుకుని ఏకంగా 100 కి.మీలు ప్రయాణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పోడిచే ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. చివరికి ఏమైందంటే?

రైలు కింద చిక్కుకొని ఏకంగా 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. చివరికి ఏమైందంటే?

భారతీయ రైల్వే రైలు ప్రమాదాల నివారణకు కావాల్సిన చర్యలు తీసుకుంటుంది. రన్నింగ్ ట్రైన్ ఎక్కకూడదని, పట్టాలు దాటకూడదని సూచిస్తుంటారు అధికారులు. దీనిపై ఎంత అవగాహన కల్పించినప్పటికీ ప్రయాణికుల్లో మాత్రం మార్పు రాదు. కదులుతున్న రైలు ఎక్కి జారిపడి గాయపడి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పట్టాలు దాటుతూ కూడా మృతి చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. కాగా ఓ బాలుడు ఓ రైలు కింద చిక్కుకుని ఏకంగా 100కి.మీలు ప్రయాణించాడు. ఒళ్లు గగుర్పోడిచే ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. చివరికి ఏమైందంటే?

పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాలల భారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే విధంగా యూపీలో ఓ బాలుడు ఆడుకుంటూ గూడ్స్ రైలు ఎక్కి ప్రమాదకర స్థితిలో 100కి.మీలు ప్రయాణించాడు. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ బాలుడు ఆడుకునేందుకు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. ఆ కాసేపటికే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదిలింది. దీంతో ఆ బాలుడు కిందికి దిగే అవకాశం లేకుండా పోయింది. కిందికి దిగితే చనిపోతాననే భయం ఆ బాలుడిలో కలిగింది.

దాంతో ఆ పిల్లోడు బిక్కుబిక్కుమంటూ రైలు చక్రాల మధ్య ఉండే చిన్న గ్యాప్ లో కూర్చుండిపోయాడు. అలా ప్రమాదకరస్థాయిలో ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈలోగా గూడ్స్ ట్రైన్ ఉత్తరప్రదేశ్ లోని హార్దోయ్ స్టేషన్ వద్దకి చేరుకుంది. ఇది గమనించిన రైల్వే సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైలు సిబ్బందికి చక్రాల మధ్య కూర్చున్న బాలుడు కనిపించాడు. వెంటనే వారు ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్పిఎఫ్ సిబ్బంది చక్రాల మధ్య చిక్కుకున్న బాలుడిని బయటికి తీశారు. ఈ ఘటనలో బాలుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక విచారణలో భాగంగా పిల్లాడి కుటుంబం అలంనగర్ రాజాజీపురం లోని బాలాజీ మందిర్ లో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో ఆ పిల్లాడిని చైల్డ్ కేర్ హోమ్ కు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని.. అశ్రద్దగా ఉండొద్దని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి