iDreamPost

ఏపీ సీఎం కు భద్రత మరింత కట్టుదిట్టం

ఏపీ సీఎం కు భద్రత మరింత కట్టుదిట్టం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సెక్యూరిటీ మరింత రెట్టింపు చేస్తున్నట్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రకటించారు. ఇంటలిజెంట్ సెక్యూరిటి విభాగం ఇప్పటి వరకు ఏపీ సీఎం భద్రతను చూసేది. ఇక నుండి ఆక్టోపస్ బలగాలు జగన్ భద్రతలో కీలకంగా వ్యవహరించనున్నాయి. 30 మంది ఆక్టోపస్ సిబ్బంది షిఫ్ట్ ల వారీగా జగన్ భద్రతలో సేవలందించనున్నారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో కీలకంగా పనిచేసే ఆక్టోపస్ బలగాలు ఇప్పటి నుండి ముఖ్యమంత్రి భద్రత కోసం పనిచేయనున్నాయి. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్..ఇది ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు రూపొందించబడిన ప్రత్యేక దళం. ఈ దళాలు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే సేవలందిస్తాయి. ఉగ్రవాద,మావోయిస్ట్ ల చర్యలను అణచివేయడానికి 2007 లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆక్టోపస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తు నిర్ణయం తీసుకున్నారు. 2012 లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని కల్సా ఇబ్రహీపట్నం గ్రామంలో 570 ఎకరాలలో ఆక్టోపస్ కమాండోస్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగ్రవాద చర్యలను అణచడానికి ఆక్టోపస్ బలగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవాస్థాన భద్రతకు కూడా ఈ యాంటీ టెర్రరిస్ట్ బలగాలు సేవనందిస్తున్నాయి.

ఆక్టోపస్ లో ఉండే సభ్యులు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. అత్యాదునిక ఆయుధాలను ఉపయోగించడంలోను,బాంబులను గుర్తించడంలోను శిక్షణ తీసుకుంటారు.ఆక్టోపస్ దళాలు 2013లో సాయుధులైన ఇద్దరు ఉగ్రవాదులను పుత్తూరులో పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు వీరోచితంగా పోరాడంలో ఆక్టోపస్ దళాలు ముందుంటాయి. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే ప్రత్యేక దళం, ఇఫ్పుడు ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీ వింగ్‌లో చేరడం చర్చనీయాంశమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి