iDreamPost

రోహిత్, సూర్య, పాండ్యా, బుమ్రా కాదు.. ముంబై జట్టులోకి కొత్త సలార్!

  • Published Mar 20, 2024 | 2:31 PMUpdated Mar 20, 2024 | 2:31 PM

Nuwan Thushara, IPL 2024: మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభం కానుంది. అయితే.. ఐపీఎల్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్‌ను అనుకుంటే.. మరి మోస్ట్‌ డేంజర్‌ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Nuwan Thushara, IPL 2024: మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభం కానుంది. అయితే.. ఐపీఎల్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్‌ను అనుకుంటే.. మరి మోస్ట్‌ డేంజర్‌ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 2:31 PMUpdated Mar 20, 2024 | 2:31 PM
రోహిత్, సూర్య, పాండ్యా, బుమ్రా కాదు.. ముంబై జట్టులోకి కొత్త సలార్!

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2024 సీజన్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ అంగరంగ వైభవంగా ఆరంభం అవుతుంది. అయితే.. ఈ సారి అన్ని టీమ్స్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. టైటిల్‌ ఫేవరేట్స్‌ నుంచి ఏ టీమ్‌ను కూడా తీసేయడానికి లేదు. అన్ని టీమ్స్‌ కూడా ఈ ఏడాది టైటిల్‌ కోసం హోరాహోరీగా పోటీ పడేలా కనిపిస్తున్నాయి. అయితే.. ప్రతి టీమ్‌ కూడా మిగతా టీమ్స్‌ బలాబలాలను అంచనా వేస్తూ.. ఆ టీమ్స్‌లోని డేంజరస్‌ ప్లేయర్ల కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న 10 టీమ్స్‌లో 9 టీమ్స్‌ ఓ కొత్త బౌలర్‌కు భయపడుతున్నాయి. ఆ ఒక్క బౌలర్‌ను ఎదుర్కొంటే చాలు.. ఆ టీమ్‌ను ఓడించొచ్చు అని భావిస్తున్నాయి. మరి ఆ బౌలర్‌ ఎవరు? ఏ టీమ్‌లో ఉన్నాడు? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లోని ప్రతీ టీమ్‌ స్ట్రాంగ్‌గానే ఉన్నా.. ఆయా టీమ్స్‌లో కొంతమంది కీలక ఆటగాళ్లు ఉంటారు. ఆ జట్టు విజయావకాశాలు ఆయా ప్లేయర్లపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. క్రికెట్‌ అనేది టీమ్‌ గేమ్‌ అయినప్పటికీ.. ఒకరిద్దరు కీ ప్లేయర్లు ఉంటారు. వారు రాణిస్తే మ్యాచ్‌ వన్‌సైడ్‌ అయిపోతుంది. వాళ్లు విఫలం అయితే.. మ్యాచ్‌ చేజారే ఛాన్సులే ఎక్కువ. అలాంటి ఒకరిద్దరు ప్లేయర్లు ప్రతి టీమ్‌లో ఉంటారు. సీఎస్‌కేలో జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోని, ఆర్సీబీలో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, రాజస్థాన్‌లో జోస్‌ బట్లర్‌ ఇలా కొన్ని టీమ్స్‌కు కొంతమంది మెయిన్‌ పిల్లర్స్‌ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ను తీసుకుంటే.. రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా మెయిన్‌ ప్లేయర్లుగా ఉన్నారు. అలాగే బౌలింగ్‌ గురించి మాట్లాడుకుంటే.. జస్ప్రీత్‌ బుమ్రా పేరు చెప్పుకోవచ్చు.

IPL teams scared of nuwan thushara

అయితే.. బుమ్రాకు తోడు మరో స్పీడ్‌ గన్‌ ముంబై టీమ్‌లో యాడ్‌ అయింది. అతన్ని చూసే.. ప్రస్తుతం ఐపీఎల్‌లోని మిగతా 9 టీమ్స్‌ వణికిపోతున్నాయి. బుమ్రాను ఆడటమే కష్టం రా దేవుడా అనుకుంటే.. ఇప్పుడు ఈ కుర్ర బౌలర్‌ కూడా ప్రత్యర్థి జట్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు. అతనే శ్రీలంక యువ బౌలర్‌ నువాన్‌ తుషారా. మలింగా స్టైల్‌ బౌలింగ్‌, కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌, యార్కర్‌ వేస్తే కొమ్ములు తిరిగిన బ్యాటర్‌ అయినా సరే వికెట్‌ ఇవ్వాల్సిందే. ఈ మధ్యనే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ సాధించి ఔరా అనిపించాడు. దిమ్మతిరిగే టాలెంట్‌ ఉంది కాబట్టే ముంబై ఇండియన్స్‌ ఇతన్ని భారీ ధరపెట్టి దక్కించుకుంది.

ఐపీఎల్‌ 2024 వేలంలో ఒక అనామక బౌలర్‌గా ఉన్న నువాన్‌ తుషారాపై ముంబై 4.8 కోట్లు పెట్టింది. అప్పటికే జట్టులో బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌ ఉ‍న్నాడు. అలాగే గెరాల్డ్ కోయెట్జీ. జాసన్ బెహ్రెండోర్ఫ్, పీయూష్‌ చావ్లా లాంటి బౌలర్లు ఉన్నారు. పైగా వేలం సమయంలో ముంబై వద్ద డబ్బు కూడా పెద్దగా లేదు. అలాంటి టైమ్‌లో తక్కువ డబ్బుతోనే అద్భుతమైన ఆటగాడిని పట్టేసింది ముంబై. మలింగా సహవాసంతోనే బుమ్రా అద్బుతంగా రాటుదేలాడు. ఇప్పుడు బై బర్తే మలింగా ఉన్న నువాన్‌ తుషారా.. ఇప్పుడు మలింగా చేతిలో పడి మరింత షైన్‌ అయితే.. అతన్ని ఎదుర్కొవడం బ్యారట్లకు కత్తి మీద సామే అవుతుంది. మరి ముంబై ఇండియన్స్‌కు నువాన్‌ తుషారా బలంగా మారుతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి