iDreamPost

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. రైల్వేలో 9000 ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసింది. పలు రీజియన్లలో ఏకంగా 9 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసింది. పలు రీజియన్లలో ఏకంగా 9 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. రైల్వేలో 9000 ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి!

ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం భారత్. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది భారతీయ రైల్వే. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్వే డిపార్ట్ మెంట్ అవసరమైన సిబ్బందిని నియమించుకుంటుంది. దేశంలోని ఏదో ఒక రైల్వే రీజియన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు శుభవార్తను అందించింది. పలు రీజియన్లలో ఖాళీగా ఉన్న 9000 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9000వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు షార్ట్ నోటిఫికేషన్ ను ప్రకటించింది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, సికింద్రాబాద్, తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైతే చాలు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో విడుదల చేయనుంది రైల్వే బోర్డు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ ను పరిశీలించవచ్చు.

ముఖ్యమైన సమాచారం :

మొత్తం ఖాళీలు:

  • 9000

విభాగాల వారీగా ఖాళీలు:

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులు:

  • 1,100

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు :

  • 7,900

అర్హతలు:

  • అభ్యర్థులు ఆయా పోస్టులననుసరించి టెన్త్, ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ప్రారంభ వేతనం:

  • నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200 చెల్లిస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 09-03-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 08-04-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి