iDreamPost

Nivetha Pethuraj: దయచేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు

తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై స్పందించారు హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌. దయచేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ ఎమోషనల్‌ ప ఓస్ట్‌ చేసింది. ఆ వివరాలు..

తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై స్పందించారు హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌. దయచేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ ఎమోషనల్‌ ప ఓస్ట్‌ చేసింది. ఆ వివరాలు..

Nivetha Pethuraj: దయచేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు

యూ ట్యూబ్ లో వైరల్ ఒక ప్రత్యేకమైన న్యూస్ కారణంగా యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇరకాటంలో పడింది. తనకి సంబంధం లేని ఇష్యూలో తనని దించి, తన ఫ్యామిలీ గౌరవమర్యాదలను మంటగలుపుతున్నారని భోరుమంటోంది. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియా బాగా వేళ్ళూనుకున్నాక, ఏ నిరాధారమైన వార్త అయినా సరే ఒక్కసారిగా వైల్డ్ ఫైర్ లా మొత్తం ప్రపంచమంతా అంటుకుంటోంది. ఫలితంగా సదరు సెలబ్రిటీస్ ఊహించని రీతిలో డిఫెన్స్ లో పడిపోతున్నారు. మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా వెనకా ముందూ ఆలోచించి, అలవోకగా మాట్లాడిన ఏ మాట కొంప ముంచుతుందోననే భయంలో కొందరు స్టార్స్ కూడా దూరంగా ఉండడాన్నే సేఫ్ అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నివేదా పేతురాజ్ విషయానికొస్తే…తన మీద లేనిపోని కట్టుకథలు తయారు చేసి, తన కుటుంబ ప్రతిష్టని, తన వ్యక్తిగత స్థాయిని కూడా దెబ్బ కొడుతున్నారని ఎక్స్ లో అతి పెద్ద పోస్ట్ పెట్టింది.

అసలు విషయానికొస్తే నివేదా పేతురాజ్ ఫ్రస్తుతం ఫేస్ చేస్తున్న సోషల్ మీడియా ట్రైల్ ఏంటంటే….తమిళనాడు స్పోర్ట్స్ మినిష్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎంకె స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజు మీద మనసు పడి, ప్రేమ కానుకగా 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా గల 50 కోట్ల వర్త్ ఇల్లు కొనిచ్చాడని ఒక యూ ట్యూబర్ సవుకు శంకర్ వీడియో పెట్టాడు. అది భయంకరంగా వైరల్ కావడమే కాదు, కొందరు నివేదాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోన్లు, మెసెజెస్, మరి కొందరు ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యానాలు మొదలు పెట్టారు. దాంతో అదో పెద్ద తతంగమైపోయి, నివేదాకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అందరకీ సమాధానాలు, సంజాయిషీలు ఇచ్చుకోలేని సంక్షోభంలో పడిపోయింది నివేదా.

తనకి ఎటువంటి సంబంధమూ లేని వ్యవహారంలో ఇరికించి, దారుణంగా తనని, తన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చారని గొల్లుమంటోంది పాపం నివేదా. దీని మీద జాలిగొలుపుతూ, తనదైన ఓ సుదీర్ఘమైన వివరణ ఇచ్చే పనిలో తాజాగా పడింది.‘’సినిమా అవకాశాలు కూడా ఎప్పుడూ ఎవరినీ అడగని నాకు అవకాశాలు వాటికవే వస్తున్నాయి. వచ్చాయి కూడా. నాకు 16 ఏళ్ళు వచ్చిననాటి నుంచి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నా. ఎవరినీ ఏదీ ఎప్పుడూ చేయిసాచి అడగలేదు. ఎప్పటినుంచో 20ఏళ్ళగా దుబాయ్ లోనే ఉంటున్నాం. మాది చాలా సామాన్యమైన కుటుంబం. మా లైఫ్ స్టయిల్ కూడా చాలా నిరాడంబరమైనది. మా బతుకేదో మేము బతుకుతుంటే ఇటువంటి దుమారాలు లేపి, మా కుటుంబాన్ని నవ్వులపాలు చేయడం సమంజసం కాదు. జర్నలిజం అంటే ఇదా? ఏదైనా ఉంటే, వింటే దాని మీద క్లారిటీ తీసుకుని చెయ్యాలి కదా. దుబాయ్ లో కూడా మేము ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. మాకు లగ్జరీలు తెలియవు. కోరుకోం కూడా. నా మీద జరుగుతున్న ఇదంతా నిరాధారమైనది’’ అని చెప్పుకొచ్చింది.

‘‘మీరనుకుంటున్నంత గొప్పవ్యక్తిని కాదు నేను. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కొంత కంఫర్ట్ లోకి వచ్చాం. ప్రతిష్టాత్మకమైన జీవితాన్ని కోరుకునే మనిషిని నేను. మీ కుటుంబాలలో ఉన్న స్త్రీలు ఎలా అయితే ఒక మంచి జీవితాన్ని కోరుకుంటారో నేను కూడా అంతేనని భావించండి. ఈ విషయంమీద కోర్టులకెక్కదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా మానవత్వం మీలో కూడా ఉందని, ఉంటుందనే నమ్ముతున్నాను. మళ్ళీ మరోసారి ఇలా నన్ను దెబ్బ తీయరనే అనుకుంటున్నాను. జర్నలిస్టులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా….ఇటువంటి వార్తలు రాసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి రాయండి. మాకు వ్యక్తిగతమైన గౌరవాలుంటాయని గ్రహించండి’’ అని సుదీర్ఘంగా బాధ పడింది నివేదా పేతురాజ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి