iDreamPost

Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంట తీవ్ర విషాదం!

ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖల ఇంట వరుస విషాదాలు నెలకొంటున్నాయి. హార్ట్ ఎటాక్, వృద్దాప్యం, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాల వల్ల ప్రముఖ ఇంట విషాదాలు జరగడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కన్నీరు ముమున్నీరవుతున్నారు.

ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖల ఇంట వరుస విషాదాలు నెలకొంటున్నాయి. హార్ట్ ఎటాక్, వృద్దాప్యం, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాల వల్ల ప్రముఖ ఇంట విషాదాలు జరగడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కన్నీరు ముమున్నీరవుతున్నారు.

Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంట తీవ్ర విషాదం!

ఇటీవల సినీ, రాజకీయ నేతల ఇంట తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దుఖఃంలో మునిగిపోతున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2018 లో ఏపీ క్యాబినెట్ లో హూదాలో పనిచేశారు. ఆయన సతీమణి భారత ఆర్ధిక, కార్పోరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్. పరకాల ప్రభాకర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె అత్త, మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పరకాల ప్రభాకర్ మాతృమూర్తి.. మాజీ ఎమ్మెల్యే పరకాలా కాళికాంబ తుది శ్వాస విడిచారు. వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని స్వగృహంలో కన్నుమూశారు. కాళికాంబకు ఇద్దరు కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు. ప్రముఖ రాజకీయ ఆర్థిక వేత్త, విశ్లేషకులు అయిన పరకాల ప్రభాకర్ ఆమె పెద్ద కుమారుడు.. ఆయన సతీమణి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 1981 లో ఉప ఎన్నికల్లో నరసపారం ఎమ్మెల్యేగా కాళికాంబ ఎన్నికయ్యారు. మహిళా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో గొప్ప పేరు సంపాదించారు కాళకాంబ.

Nirmala Sitharaman's house tragedy!

ఆమె భర్త పరకాల శేషావతారం మాజీ మంత్రి 1979,78,81 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. వారి కుటుంబం మొత్తం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఇక పరకాల ప్రభాకర్ ప్రత్యక్షంగా పదవుల్లో లేకున్నా… రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో కేంద్ర ఆర్ధిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖామంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు. గతంలో పరకాల ప్రభాకర్.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అంతకు ముందు బీజేపీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కాళికాంబ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి