iDreamPost

నిమ్మల ఓవర్ యాక్షన్ .. ఈ టైంలో సైకిల్ రాజకీయాలా ?

నిమ్మల ఓవర్ యాక్షన్ .. ఈ టైంలో  సైకిల్  రాజకీయాలా ?

తెలుగుదేశంపార్టీ పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడు. అధికారుల వైఖరికి నిరసనగా తన నియోజకవర్గమైన పాలకొల్లు నుండి జిల్లా కేంద్రమైన ఏలూరుకు సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఇంతకీ అధికారులపై నిమ్మల ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాడు ? ఎందుకంటే అధికారులెవరూ తన ఫోన్ కు స్సందించటం లేదట. రైతుల సమస్యలపై తాను ఫోన్ చేసి మాట్లాడుదామని అనుకుంటే కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులెవరూ స్పందించటం లేదట.

అందుకనే ఏకంగా పాలకొల్లు నుండి ఏలూరుకు సైకిల్ యాత్ర మొదలుపెట్టేశాడు. ప్రజాప్రతినిధి ఫోన్ చేస్తే స్పందించలేనంత బిజీ పనులు కలెక్టర్, ఎస్పీకి ఏమున్నారో ఈ ఎంఎల్ఏకి అర్ధం కావటం లేదట. సరే ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని, రైతులకు బకాయిలు చెల్లించటంతో పాటు సాగునీరు అందించాలని కూడా రామానాయుడు డిమాండ్ చేశారు.

అయితే ఈ నెల ఒకటవ తారీకునే ఆక్వా రైతుల‌కు ఊర‌ట క‌ల్పించేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్రోసెసింగ్ యూనిట్లు అన్నీ తెరిచేలా చ‌ర్య‌లు తీసుకొని ఎంపెడా స‌హాయంతో ఆక్వా కౌంట్ ని నిర్ధారించి, ధ‌ర‌లు ప్ర‌క‌టించారు. నిర్ధేశిత ధరకన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేయ‌డానికి లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది కూడా. ఒక వేళ కొనుగోలు చెయ్యటానికి ప్రాససింగ్‌ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. అధికారులు నేరుగా ఎక్స్‌పోర్ట్‌ మార్కెటింగ్‌ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈపాటికే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పట్టుంచుకోకుండా అదే డిమాండులతో రామానాయుడు సైకిల్ యాత్ర చేయటం విచిత్రం.

అధికారుల మీద ఆరోపణలు కూడా రాజకీయ దురుద్దేశ్యంతో చేసినవే. యావత్ అధికార యంత్రాంగం ప్రతి జిల్లాలోను కరోనా వైరస్ నియంత్రణపైనే దృష్టి పెట్టిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా ప్రతి జిల్లాలోను కలెక్టర్, ఎస్పీనే కీలక అధికారులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 24 గంటలూ బిజీగానే ఉంటారు. ఒకవైపు వైరస్ సమస్య పెరిగిపోతోంది కాబట్టి మొత్తం అధికారులంతా ఇదే బిజీలో ఉంటారు.

ఇక ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనాలనే డిమాండ్ మంచిదే కానీ తమ హయాంలో చంద్రబాబునాయుడు ఏమి చేశాడో ఎంఎల్ఏకి గుర్తులేదా ? ఆక్వారంగాన్ని అసలు వ్యవసాయ రంగంలో కలపమని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదసలు. “తుందుర్రు” ఆక్వా పార్క్ విషయంలో ఈ రామానాయుడు ప్రదర్శించిన దాష్టికాన్ని ప్రజలు మర్చిపోలేరు.

ఇక రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలంటున్నాడు. ఇప్పటికే ప్రభుత్వం రూ 8470 కోట్లతో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొన్నదని ప్రభుత్వం ప్రకటించింది కదా. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచుతున్న విషయం ఎంఎల్ఏకి తెలీదా ? 250 మెట్రిక్ టన్నుల అరటి పంటను కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్నది. ఇంకా కొనేందుకు రెడీ అవుతున్న విషయం ఎంఎల్ఏకి తెలీకుండానే మాట్లాడుతున్నాడా ? మొత్తానికి నిమ్మల మొదలుపెట్టిన సైకిల్ రాజకీయాలు ఎంతదాకా వెళుతుందో చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి