iDreamPost

కార్తికేయ 2 అందుకే తగ్గాడు

కార్తికేయ 2 అందుకే తగ్గాడు

పాపం నిఖిల్ కార్తికేయ 2కి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆగస్ట్ 5 నుంచి 12కి షిఫ్ట్ అయ్యింది. అదే రోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం ఉన్నప్పటికీ ఇక వేరే ఆప్షన్ లేదు. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిపోయింది. లేట్ చేస్తే ఆగస్ట్ 25 విజయ్ దేవరకొండ లైగర్ రేస్ లో ఉంది. దాని టాక్ ఎలా ఉండబోతున్నా ఆలోగా వీలైనంత సేఫ్ గా బయట పడటం అవసరం. అందుకే కార్తికేయ 2ని షిఫ్ట్ చేయడం మినహా వేరే మార్గం లేకపోయింది. అయిదో తేదీకి బింబిసార ఎప్పుడో లాక్ కావడం నిఖిల్ కొచ్చిన ప్రధాన సమస్య. అందులోనూ అది కూడా ఫాంటసీ జానర్ కావడంతో ఎంత లేదనుకున్నా పోలికలు వస్తాయి. అందుకే డ్రాప్ అవ్వడమే సేఫ్.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ 2 సక్సెస్ నిఖిల్ కు చాలా కీలకం. కృష్ణుడి సెంటిమెంట్ నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ కావడంలో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇందులో కథేంటో పూర్తి క్లూస్ ఇవ్వకపోయినా టీజర్ లో చూపించిన విజువల్స్ ని బట్టే జనానికి ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఫస్ట్ పార్ట్ లో కలర్స్ స్వాతి చేసిన సంగతి తెలిసిందే. రాబోయే మూడు నెలల్లో నిఖిల్ మరో రెండు సినిమాలు 18 పేజెస్, స్పై రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటి బిజినెస్ మీద కార్తికేయ 2 రిజల్ట్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.

ఇక్కడే మరో ట్విస్టు ఉంది. 11న రావాల్సిన విక్రమ్ కోబ్రా టెక్నికల్ రీజన్స్ వల్ల దాదాపు తప్పుకున్నట్టే. అఫీషియల్ గా చెప్పలేదు అంతే. రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశాలున్నాయి. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతోనూ కార్తికేయ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ట్రయాంగిల్ వార్ అయినప్పటికీ మూడు డిఫరెంట్ జానర్స్ కావడంతో ప్రేక్షకులను ఏది ఎక్కువ ఆకట్టుకుందనేది వేచి చూడాలి. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ని ఎవరు బాగా వాడుకుంటారో వాటికొచ్చే టాక్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. థియేటర్లకు జనాన్ని హౌస్ ఫుల్ అయ్యే రేంజ్ లో రప్పించేలా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, ది కాశ్మీర్ ఫైల్స్ తప్ప మళ్ళీ ఏవీ ఆ స్థాయిలో ఆడలేదు. చూడాలి ఇవేం చేస్తాయో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి