iDreamPost

Niharika Konidela: నిహారిక షోలో వింత ప్రశ్న! మొహమాటం లేకుండా అడిగేసిందిగా!

  • Published Mar 12, 2024 | 8:45 PMUpdated Mar 12, 2024 | 8:45 PM

మెగా డాటర్ నిహారిక ఆహాలో ఓ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ వింత ప్రశ్న ఎదురైంది. మొహమాటం లేకుండా అలా అడిగేయడంతో అంతా షాకయ్యారు.

మెగా డాటర్ నిహారిక ఆహాలో ఓ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ వింత ప్రశ్న ఎదురైంది. మొహమాటం లేకుండా అలా అడిగేయడంతో అంతా షాకయ్యారు.

  • Published Mar 12, 2024 | 8:45 PMUpdated Mar 12, 2024 | 8:45 PM
Niharika Konidela: నిహారిక షోలో వింత ప్రశ్న! మొహమాటం లేకుండా అడిగేసిందిగా!

మెగా డాటర్ నిహారిక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్​గా ఉంటున్నారు. మొన్నటి వరకు పలు ఫారెన్ ట్రిప్స్​తో లైఫ్​ను ఎంజాయ్ చేశారు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూతో బాగా వైరల్ అయ్యారు. అయితే ఇప్పుడు నటిగా, నిర్మాతగా, యాంకర్​గా మళ్లీ బిజీ అయ్యారు. ఆమె యాంకర్​గా ‘చెఫ్ మంత్ర’ కుకింగ్ షో కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహాలో ఇది టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మూడోది మొదలైంది. ఈ షోలో యాంకర్​గా అదరగొడుతున్నారు నిహారిక. లేటెస్ట్​గా చెఫ్ మంత్ర కొత్త ఎపిసోడ్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ వింత ప్రశ్న ఎదురైంది. ఎలాంటి భయం, మొహమాటం లేకుండా అలా అడిగేయడంతో అందరూ షాకవుతున్నారు.

చెఫ్​ మంత్ర షోలో హీరో సుహాస్, ‘ఫిదా’ ఫేమ్ శరణ్య పాల్గొన్నారు. వీళ్లు తమ కుకింగ్ టాలెంట్​ను బయటపెట్టుకున్నారు. వీరితో వెరైటీ వంటలు వండిస్తూనే సరదాగా ఎన్నో కబుర్లు చెప్పించారు నిహారిక. అయితే షో సరదాగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఓ వింత ప్రశ్న ఎదురైంది. మొదట సుహాస్​కు ఓ క్వశ్చన్ ఎదురైంది. ‘మీరు డ్యాష్ లేకపోతే ఉండలేరు?’ అనేది ఆ ప్రశ్న. దాన్ని ఆయన చదివి వినిపించారు. ఆ తర్వాత శరణ్యకు ఇంకా బోల్డ్​ క్వశ్చన్ వచ్చింది. ‘మీరు ఇష్టంగా డ్యాష్ చేసింది ఎవరితో?’ అనేదే ఆ క్వశ్చన్. తమకు వచ్చిన ఈ ప్రశ్నలకు వాళ్లు నవ్వుతూ, సిగ్గుతో సమాధానం చెప్పడం ప్రోమోలో హైలైట్​గా మారింది. ఈ ప్రశ్నలు విని ‘బాబోయ్’ అని నిహారిక నవ్వాపుకోలేకపోయారు.

శరణ్యకు వచ్చిన ప్రశ్న చూసి ‘ఆయనే చేస్తారు పాపం’ అని సుహాస్ సెటైర్ వేశారు. దీనికి శరణ్య ‘నీకు దండం పెడతా’ అంటూ సుహాస్​ను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి వంటలు చేయడంలో బిజీ అయిపోయారు. అలాగే ‘అంబాజీపేట బ్యాండ్’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి మొహమాటం లేకుండా వింత ప్రశ్నలు అడిగేయడంపై నెటిజన్స్ షాకవుతున్నారు. ఇవి చాలా బోల్డ్ క్వశ్చన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, చెఫ్​ మంత్ర షోతో పాటు పలు వెబ్ సిరీస్​లు, మూవీస్​లో నిహారిక యాక్ట్ చేస్తున్నారు. హీరో మంచు మనోజ్ ‘వాట్ ది ఫిష్’లో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి.. నిహారిక షోపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ రిలీజ్.. కల్యాణి వచ్చా వచ్చా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి