iDreamPost

కెటిఆర్ ఫామ్‌హౌస్ పై ఎన్జీటి కీలక నిర్ణయం: నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నియామ‌కం

కెటిఆర్ ఫామ్‌హౌస్ పై ఎన్జీటి కీలక నిర్ణయం: నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నియామ‌కం

తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ శాఖ‌ మంత్రి, అధికార టిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కెటిఆర్) ఫామ్ హౌస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఫామ్ హౌస్ ఆక్రమణ ఆరోపణలపై  నిజ నిర్థారణ కమిటిని నియమించింది.

జీఓ నెంబ‌ర్ 111 ఉల్లంఘ‌న‌కి సంబంధించిన కేసులో కెటిఆర్ కు నోటీసులు జారీ చేసింది. మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తిగా జీవో 111ను ఉల్లంఘిస్తూ జ‌న్వాడ ప‌రిధిలో ఫామ్‌ హౌజ్‌ నిర్మించారంటూ ఇటీవల కాంగ్రెస్ ఎంపి రేవంత్‌ రెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఆయ‌న ఈ విష‌యంపై గ్రీన్ ట్రిబ్యూన‌ల్ లో చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ విచారణ జరిపింది. మంత్రి కెటిఆర్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వం, ప‌ర్యావ‌ర‌ణ నియంత్ర‌ణ మండ‌లి, హెచ్‌ఎండిఏకు నోటీసులు ఇచ్చింది.

అంతేగాక ఓ నిజనిర్దారణ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా సెంట్రల్‌ ఎన్విరాన్మెంట్‌ రిజిస్ట్రార్, ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ పిసిబి, జిహెచ్‌ఎంసి, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండిఎ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది. రెండు నెలల స‌మ‌య కాలంలో క‌మిటీ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. క‌మిటీ ఈ విషయంలో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత త‌దుపరి ఆదేశాలు వెల్ల‌డిస్తామ‌ని ఎన్‌జిటి ధ‌ర్మాసనం వెల్ల‌డించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి