పెళ్లికూతురు కోసం పోస్టర్లు వేసి తమిళనాడు కుర్రాడు వైరల్ అయ్యాడు
తెలిసినవాళ్లు సంబంధాలు పట్టుకొస్తారు, లేదంటే ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ సైట్‌ల్లో డిటైల్స్ ఇస్తారు. తగిన సంబంధాలు వెతుక్కొంటారు. ఈ ఇంజనీర్, ఈ రెండూ ట్రైచేశాడు. చివరి భార్య కోసం బిల్‌బోర్డ్ ప్రకటనలిచ్చాడు. ఇది విదేశాల్లో కొంత పాపులర్ కాని, ఇండియాలో కాదు. అందుకే తమిళనాడు కుర్రాడు మ్యాట్రిమోనియల్ పోస్టర్ తో వైరల్ అయ్యాడు.
పేరు ఎస్మెస్ జగన్. 27 ఏళ్లు. మధురైలోని విల్లాపురం.ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తాడు. ఎలా ట్రైసినా సరైన భాగస్వామి దొరకలేదని, వెరైటీగా ప్లాన్ చేశాడు. భార్య కోసం టౌన్ నిండా పెద్ద పోస్టర్లు వేశాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ తన పూర్తి డిటైల్స్ కూడా ఇచ్చాడు. ఈ పోస్టర్ తయారుచేసిందికూడా జగనే. అతను పార్ట్ టైం డిజైనర్.
ఈ పోస్టర్ల ను చూసి ముందు జనం విస్తుపోయారు. ఆ తర్వాత నవ్వుకున్నారు.
మరిపోస్టర్లు పెట్టాక సంబంధాలు ఏమైనా వస్తున్నాయా? అబ్బే లేదంట. మ్యారేజ్ బ్రోకర్లు ఫోన్లు చేస్తున్నారంట.
ఇప్పుడు ఈ పోస్టర్ తో చాలామంది మీమ్స్ తయారుచేసి ఏడిపిస్తున్నారు. అయినా జగన్ పట్టించుకోవడంలేదు. త్వరలో తనకూ మంచి సంబంధం దొరుకుతుంది. అప్పుడు థాంక్స్ చెబుతూ మరో పోస్టర్ వేస్తానంటున్నాడు.
79363