iDreamPost
iDreamPost
‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు వేశారు . అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.