తిండిలేదు, పెట్రోల్ లేక శ్రీలంక క్రికెటర్ ప్రాక్టీస్ కోసం స్డేడియంకు వెళ్లలేని దుస్థితి. కరెంట్ లేదు, రోజంతా బ్లాక్అవుట్లే. పెరిగిన ధరలతో శ్రీలంక 70 సంవత్సరాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లంకను హిట్లర్ లా పాలించాలనుకున్న మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాల్దీవులకు పారిపోయారు. ఇక చేసేదిలేక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎమర్జెన్సీ విధించారు. ఈ ద్వీప దేశం నిండా నిరసనలే. నినాదాలే. నిరసనకారులు వీధులను ఆక్రమించారు. చివరకు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశారు. అధ్యక్షుడి గదిలో చక్కగా కూర్చొని టీవీ చూశారు.
ఈ నిరసనల హోరులో మధుహాన్సి హసింతర(Maduhansi Hasinthara) అనే అమ్మాయి కొలంబో రాష్ట్రపతి నివాసాన్ని చూడాలనుకుంది. నిరసనల మధ్య, హసింతరా ఒక టూరిస్ట్ లా అధ్యక్ష భవనంలో తిరిగి ఫోటోలు దిగింది.
జూలై 12న తన ఫేస్బుక్ ఖాతాలో ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్. ఎట్ ప్రెసిడెంట్స్ హౌస్, కొలంబో అని క్యాప్షన్ కూడా పెట్టింది.
ఒకటికాదు, మొత్తం 26 ఫోటోలు. ప్రెసిడెంట్ హౌస్ లో బెడ్ మీద, ఛైర్లు, సోఫాలపై, బైట కారుపక్కన స్టైల్ గా నిల్చొని ఫోటోలు దిగింది.
ఈ ఫోటోలు చాలామంది యూజర్లకు నచ్చలేదు. దేశం సంక్షోభంలో చిక్కుకుంటే మధ్యలో ఇలా ఫోటోలు దిగడమేంటని క్లాస్ పీకారు.
మరికొందరైతే, దేశాన్ని ఎగతాళి చేయడమని గట్టిగా స్పందించారు.
80871