• Home
  • తాజా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • సినిమా వార్తలు
  • Nostalgia
  • ఫోటో గ్యాలరీ
  • రివ్యూస్
  • వీడియోలు
  • ID Exclusive
    • రాజకీయ వార్తలు
    • సినిమా వార్తలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • నోస్టాల్జియా
    • వీడియోలు
    • పోల్స్
    • స్పాట్ లైట్
    • బాక్స్ ఆఫీసు పోర్టల్
    • ట్రెండింగ్ వార్తలు
    • పాపులర్ న్యూస్
    • ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు
    • USA షో టైమ్స్
    Home » News » నాట్‌వెస్ట్‌ సిరీస్‌ హీరోస్ కైఫ్‌, యువరాజ్ సంభాషణ

    నాట్‌వెస్ట్‌ సిరీస్‌ హీరోస్ కైఫ్‌, యువరాజ్ సంభాషణ

    • By Srinivas Racharla Published Date - 04:42 AM, Wed - 22 April 20 IST
    నాట్‌వెస్ట్‌ సిరీస్‌ హీరోస్ కైఫ్‌, యువరాజ్ సంభాషణ

    లాక్ డౌన్ వేళ సెలెబ్రెటీస్ సోషల్ మీడియా కేంద్రంగా గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. కీలక సంఘటనల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ కైఫ్‌, యువరాజ్ సింగ్ 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన చారిత్రక విజయం గురించి మహమ్మద్ కైఫ్‌, యువరాజ్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో గుర్తు చేసుకున్నారు.

    కైఫ్‌ మాట్లాడుతూ “నాటి ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని భావించా. అప్పటికే నేను నిలదొక్కుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు.దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలవచ్చు అనుకున్నా.కానీ నువ్వు ఔటయ్యేసరికి చాలా బాధపడ్డా.ఇంక గెలుపు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చా” అని నాటి అనుభూతులను ప్రస్తావించాడు.

    కైఫ్‌ తన సంభాషణను కొనసాగిస్తూ అండర్‌-19 ప్రపంచకప్‌-2000 ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 25 బంతులలో 58 పరుగులు చేసి యువీ సాధించిన అర్థ సెంచరీ తనకెంతో ఇష్టమని చెప్పాడు.ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ కుర్ర బౌలర్ లైన మిచెల్‌ జాన్సన్‌,షేన్‌ వాట్సన్‌ బంతులను చితకబాదాడని కైఫ్‌ తెలిపాడు.

    అనంతరం యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ అద్భుత ఫీల్డింగ్‌తో భారత్‌కు మహమ్మద్ కైఫ్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని లైవ్‌ చాట్‌లో యూవీ పొగడ్తలతో కైఫ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు.ఇంకా తామిద్దరం కలిసి పాయింట్‌,కవర్‌ దిశలలో టీమిండియా ఫీల్డింగ్ గతిని సమూలంగా మార్చేశామని పేర్కొన్నాడు.నేటి భారత జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లు ఉన్నారని చెప్పాడు.అయితే భారత జట్టు ఫీల్డింగ్‌లో ఒక నూతన ఒరవడికి నాంది పలికింది మాత్రం తామేనని యూవీ వ్యాఖ్యానించాడు.

    2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌:

    ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో 326 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలి మొదటి వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్‌లో దినేష్ మెంగియా,సచిన్,ద్రావిడ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో 145 పరుగుకే 5 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది.ఈ దశలో నాటి యువ బ్యాట్స్‌మెన్‌లు యూవీ, కైఫ్‌ అద్భుతంగా రాణించి విజయంపై ఆశలు రేకెత్తించారు.కానీ లక్ష్యానికి 59 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిన స్థితిలో 63 బంతులలో 9 ఫోర్లు,ఒక సిక్స్‌తో 69 పరుగులు చేసిన యువీ ఔటయ్యాడు.

    పట్టువదలని విక్రమార్కుడిలా టెయిలెండర్‌లతో కలిసి పోరాడిన కైఫ్‌ మరో 3 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల నష్టానికి 326 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచిన కైఫ్ 75 బంతులలో 6 ఫోర్లు,2 సిక్స్‌లతో అజేయంగా 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. విజయానంతరం అప్పటి భారత కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ గ్యాలరీలో షర్ట్‌ విప్పి గిరగిరా తిప్పుతూ కేకలు వేయడం భారత క్రికెట్ అభిమానులకు ఈనాటికీ మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయింది.

    Tags  

    • England
    • Lockdown
    • Mohammad Kaif
    • Sourav Ganguly
    • Yuvraj Singh
    • యువరాజ్‌ సింగ్
    • లాక్ డౌన్
    • సౌరవ్ గంగూలి

    Related News

    ఇంగ్లాండ్ బాదుడుకో పేరుంది. బాజ్‌బాల్ హిట్టింగ్ అంటే ఏంటి?

    ఇంగ్లాండ్ బాదుడుకో పేరుంది. బాజ్‌బాల్ హిట్టింగ్ అంటే ఏంటి?

    ఇప్పుడు టీం అంటే ఎలాగ ఉండాలి? ప‌్ర‌త్య‌ర్ధి ఊహించ‌ని టార్గెట్లు పెట్టాలి, వాటిని సాధించాలి. మరి ఆట‌గాడు? ప‌్ర‌తి క్ష‌ణం ఎలా మెరుగుప‌డాలో తెలుసుకోవాలి. మ‌రి కోచ్ సంగ‌తి? ఒక ఆట‌గాడి స్కిల్ ను పెంచ‌డం, జ‌ట్టు విజ‌య‌లు సాధించేలా గైడ్ చేయ‌డం. ఇవ‌న్నీ 20 ఏళ్ల క్రితం నాటి మాట‌లు. ఇప్పుడు మారాల్సింది ఆట‌కాదు, క‌ల్చ‌ర్ మారాలి. ఇది ఎలాంటి కల్చ‌ర్ అంటే ప్ర‌త్య‌ర్ధి గుక్క‌తిప్పుకోనివ్వ‌నంత వేగం. మ‌నతో త‌ల‌ప‌డాలంటేనే, ఎదుటి టీంలో వ‌ణుకు మొద‌లుకావాలి. […]

    11 months ago
    ఇంగ్లాండ్ ఊచ‌కోత‌, 50ఓవ‌ర్ల‌లో 498 ర‌న్స్, కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

    ఇంగ్లాండ్ ఊచ‌కోత‌, 50ఓవ‌ర్ల‌లో 498 ర‌న్స్, కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

    12 months ago
    దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

    దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

    1 year ago
    ఆకాశంలో ఎగురుతున్న ఓడ.. నిజమేనా అంటూ ఆశ్చర్యపోతున్న ప్రజలు..

    ఆకాశంలో ఎగురుతున్న ఓడ.. నిజమేనా అంటూ ఆశ్చర్యపోతున్న ప్రజలు..

    1 year ago
    తెలంగాణలో లాక్‌డౌన్‌..?

    తెలంగాణలో లాక్‌డౌన్‌..?

    2 years ago

    తాజా వార్తలు

    • Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్
      4 months ago
    • ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్
      4 months ago
    • గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?
      4 months ago
    • రూటు మార్చిన శర్వానంద్
      4 months ago
    • ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా
      4 months ago
    • ఓటిటి హక్కులకే 80 కోట్లా?
      4 months ago
    • ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?
      4 months ago

    సంఘటనలు వార్తలు

    • ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా
      4 months ago
    • ప‌వ‌న్ పిల్ల‌ల ఫీజులు క‌ట్టుకోలేరా?
      4 months ago
    • రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?
      4 months ago
    • షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల
      4 months ago
    • పఠాన్ విజయానికి 5 కారణాలు
      4 months ago
    • ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?
      4 months ago
    • బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది
      4 months ago

    News

    • Box Office
    • Movies
    • Events
    • Food
    • Popular Social Media
    • Sports

    News

    • Reviews
    • Spot Light
    • Gallery
    • USA Show Times
    • Videos
    • Travel

    follow us

    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • about us
    • Contact us
    • Privacy
    • Disclaimer

    Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.