sai
sai
రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా ఒక్క రోజు పర్యటన కోసం ఢిల్లీ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశ రాజధాని చేరుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సీఎం జగన్.. అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం రాజధానికి చేరుకున్నారు.
సాయంత్రం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం జగన్.. రేపు ఉదయం అక్కడ నుంచి బయలుదేరి నేరుగా తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతిలో శ్రీవారి బ్రహోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలసి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.