కర్నాటక, మహారాష్ట్రలో మెజార్టీ స్థానాలు సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం బీజేపి ఘోరంగా విఫలమైంది. దాదాపు మహారాష్ట్రలో అధికారం చేతులోకి వచ్చినట్టే వచ్చి అకస్మాత్తుగా చేజారిపోయింది. ఇప్పుడు బీజేపి దృష్టి జార్ఖండ్ పై పడింది. నవంబర్ 30నుండి 5 దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న మొదలై డిశంబర్ 20న జార్ఖండ్ లో ఎన్నికలు ముగుస్తాయి. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
2014లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ తో కలసి 81 అసెంబ్లీ స్థానాల్లో 42 సీట్లను సాధించింది. బిజేపీ 37, ఏజేఎస్‌యూ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 5స్థానాలు గెలిచింది, అప్పుడు ప్రధాన పార్టీలైన జార్ఖండ్ ముక్తీ మోర్చా, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేసాయి. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాలు,పార్టీల అవసరాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలలో జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి పార్టీలు కలసి కూటమిగా పోటీచేస్తున్నాయి.
బలమైన ప్రతిపక్షాలు కలసి పోటీ చేయడం,ఈసారి ఎన్నికల్లో బిజేపి ఒంటరిగా పోటీ చేయడం మళ్లీ అందరి దృష్టిని జార్ఖండ్ రాజకీయాలు ఆకర్షిస్తున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలకు 13 సీట్లను బిజేపి-ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ కూటమి కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయాల కోసమే ఈసారి ఒంటరిగా పోటీచేస్తు్న్నట్టు ఏజేఎస్‌యూ ప్రకటించింది. దీంతో బిజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందా లేదా కర్నాటక, మహారాష్ట్రలో జరిగినట్టే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగులుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అగ్ర కులాలు, ఓబిసిలు గత ఎన్నికల్లో బిజేపి తరపున నిలిచారు. 50శాతం ఉన్నల వర్గాల ఓట్లు, 40 శాతం ఓబిసిలు బిజేపికి ఓట్లు వేశారు. అధికారాన్ని శాసించగల ఓట్లు ట్రైబ్స్ కు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల్లో వీరి ఓట్లే అధికారాన్ని ప్రభావితం చేస్తాయి. 25 ఎస్టీ అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో బిజేపి 11, జేఎంఎం 12 సాధించాయి.ఎక్కువగా గిరిజనుల ఓట్లను ఎవరు ప్రభావితం చేస్తారో వారే అధికారం చేజిక్కిచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈసారి బిజేపికి మాత్రం జార్ఖండ్ లో అంత సులువుగా అధికారం రాకపోవచ్చు. జాతీయంగా బిజేపి చేసిన అభివృద్ది పనులను చూసి ఓట్లు వేస్తారని బిజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. స్థానిక సమస్యలను అస్త్రంగా చేసుకుని ఈసారి అధికారం చేజిక్కిచ్చుకోవాలని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి కూటమి చూస్తోంది..
నవంబర్ 30న 13 స్థానాలకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న 20స్థానాలకు, డిసెంబర్ 12న 17స్థానాలకు,డిసెంబర్ 16 న 15 స్థానాలకు, డిసెంబర్ 20 న, 16స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కూటమి పార్టీలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని వదులుకోకుండా ప్రభుత్వ ఏర్పాటులో ముందుకు వెళ్దామని దృఢసంకల్పంతో ఉంటే.. బీజేపీ కూడా కర్ణాటక ల, మహారాష్ట్ర ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా తమతో కలిసి వచ్చే పార్టీతో వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.