iDreamPost

అద్దె చెల్లించలేదని ఇంటికి నిప్పు పెట్టిన ఓనర్! ఎక్కడంటే?

అద్దె చెల్లించలేదని ఇంటికి నిప్పు పెట్టిన ఓనర్. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

అద్దె చెల్లించలేదని ఇంటికి నిప్పు పెట్టిన ఓనర్. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

అద్దె చెల్లించలేదని ఇంటికి నిప్పు పెట్టిన ఓనర్! ఎక్కడంటే?

ఉద్యోగాల నిమిత్తం చాలా మంది వివిధ ప్రాంతాలను తిరుగుతూ అక్కడక్కడ నివాసం ఉండాల్సి వస్తుంది. దీంతో ఆఫీసు సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటారు. అయితే ప్రతీ నెల అద్దెను చెల్లిస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కానీ, కొన్ని కొన్ని సమయాల్లో చేతులో డబ్బులు లేకపోవడంతో అద్దె చెల్లించడం కాస్త ఆలస్యమవుతుంటుంది. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి ఇంటి అద్దె చెల్లించలేదు. దీంతో వారి ఇంటి ఓనర్ చాలా రోజుల నుంచి వారిని అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓపిక నశించడంతో ఆ ఓనర్ ఏకంగా అద్దె చెల్లించని వారి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. న్యూయార్క్ బ్రూక్లిన్ లోని 212 ఫోర్బెల్ స్ట్రీట్ లో రఫికుల్ ఇస్లామ్ (66) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఇతనికి రెండంతస్తుల భవనం ఉంది. అయితే గతంలో ఇదే భవనంలోని రెండో అంతస్తులో ఓ కుటుంబం అద్దెకు దిగారు. వీళ్లు చాలా కాలం నుంచి ఇందులోనే ఉంటూ వస్తున్నారు. ఇకపోతే.. ఇటీవల అద్దెకు ఉంటున్న కుటుంబం సమాయానికి అద్దె చెల్లించలేదు. దీంతో ఇంటి ఓనర్ చాలా రోజుల నుంచి వారిని అద్దె చెల్లించాలని అడుగుతూనే ఉన్నాడు. అతడు చెల్లించకపోగా, ఖాళీగా కూడా చేయలేదు. ఇక విసిగిపోయిన ఇంటి ఓనర్ రఫికుల్ ఇస్లామ్ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అద్దె చెల్లించని వారు ఉంటున్న ఇంటికి ఓనర్ నిప్పు పెట్టాడు. దీంతో అందులో ఉంటున్న పిల్లలు, భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల వెంటనే స్పందించి ఇంటి ఓనర్ పై సీరియస్ అయ్యారు. అద్దె చెల్లించకపోతే ఇలా వారిపై మీ ప్రతాపం ఏంటని నిలదీశారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇక జరిగిందంతా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగానే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఇంటి ఓనర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అద్దె చెల్లించలేదని ఇంటికి నిప్పు పెట్టిన ఓనర్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి