iDreamPost

Sankranthi 2022 Releases : పండగ సినిమాల పోటీలో కొత్త ట్విస్ట్

Sankranthi 2022 Releases : పండగ సినిమాల పోటీలో కొత్త ట్విస్ట్

సంక్రాంతి రేస్ నుంచి డిజె టిల్లు తప్పుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే పెట్టుకుని ఇంకా ట్రైలర్ తాలూకు అప్ డేట్ కూడా లేకపోవడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. నిన్న పత్రికల్లో వచ్చిన థియేటర్ల లిస్టులో సూపర్ మచ్చి ఉంది కానీ ఈ డిజె టిల్లు లేదు. సో దాదాపు పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయినట్టే. యూత్ ని టార్గెట్ చేసుకుని తీసిన ఈ ఎంటర్ టైనర్ లో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ పోషించాడు. ఇటీవలే విడుదలైన లిరికల్ వీడియో మాస్ లో బాగానే వెళ్ళింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన డిజె టిల్లు పండగ అడ్వాంటేజ్ ని వదులుకున్నట్టే.

విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన డిజె టిల్లు నిజానికి ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు.. ప్యూర్ యూత్ మూవీస్ కి సంక్రాంతి సరైన సమయం అని చెప్పలేం. పైగా రౌడీ బాయ్స్ , బంగార్రాజు నుంచి గట్టి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలకున్న బ్యాకప్, హీరోల బ్యాక్ గ్రౌండ్ తో పోలిస్తే సిద్దు వీకే. పైగా కోరినన్ని థియేటర్లు దొరకడం కష్టమే. ఒక రోజు ఆలస్యంగా గల్లా అశోక్ హీరో కూడా రేస్ లో ఉంది. అఖండ యాభై రోజుల కోసం చాలా థియేటర్లు దాన్నే కంటిన్యూ చేస్తున్నాయి. పుష్ప స్పీడ్ కొంత తగ్గినప్పటికీ సెలవు రోజుల్లో మళ్ళీ మంచి కలెక్షన్లు తెస్తోందన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లలో. బాగా వీక్ అయ్యింది ఒక్క శ్యామ్ సింగ రాయ్ అనే చెప్పాలి.

డీజే టిల్లు ముందున్న ఆప్షన్ జనవరి 26గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే ఆ డేట్ ని చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లాక్ చేయలేదు. పండగ తర్వాత కరోనా తాలూకు ప్రభావం చూసి అప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భీమ్లా నాయక్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ కావడంతో ఈ డిజె టిల్లు కోసం బయ్యర్లు వస్తారు. కాకపోతే గుంపులో రావడం కన్నా సోలోగా రిలీజ్ కావడం మీదే ఈ డిజె ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు రాకపోవడం ఈ సీజన్ మీద పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది. ఒకపక్క చిన్న సినిమాలు మరోపక్క ఒమిక్రాన్ తాలూకు భయాలు ఫైనల్ గా బాక్సాఫీస్ ఎలా ఉంటుందో చూడాలి

Also Read : Sankranthi 2022 : ఒకే రోజు నాలుగు సినిమాల సందడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి