iDreamPost

కొలువుదీరిన నగరపాలికలు.. 11 మంది మేయర్లు వీరే..

కొలువుదీరిన నగరపాలికలు.. 11 మంది మేయర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక మండళ్లు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 11 కార్పొరేషన్లను భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. బడుగుబలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది.

బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసే వైసీపీ… ఈ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగింది. ఏలూరు నగరపాలక సంస్థ, చిలకలూరిపేట మున్సిపాలిటీకి మినహా మిగతా 11 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలలో మేయర్, చైర్మన్‌ ఎన్నిక జరిగింది. మొత్తం 85 నగర, పట్టణ పాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం ప్రకారం 50 శాతం.. అంటే 42 మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌పదవులు రావాల్సి ఉండగా.. వైసీపీ 67 మందిని మేయర్లు, చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పీఠాలపై వారిని కూర్చొపెట్టింది. ఇవి మొత్తం పదవులలో 78 శాతం కావడం బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యతకు తార్కాణంగా నిలుస్తోంది. మొత్తం పదవులలో కేవలం బీసీలకే 52 శాతం దక్కడం విశేషం.

నగరపాలక సంస్థలు – మేయర్లు..

1. విజయనగరం : వెంపటాపు విజయలక్ష్మీ
2. విశాఖపట్నం : గొలగాని హరి వెంకటకుమారి
3. విజయవాడ : భాగ్యలక్ష్మీ
4. మచిలీపట్నం : వెంకటేశ్వరమ్మ
5. గుంటూరు : కావటి మనోహర్‌ నాయుడు
6. ఒంగోలు : గంగాడ సుజాత
7. తిరుపతి : డా.శిరీషా
8. చిత్తూరు : అముద
9. అనంతపురం : మహ్మద్‌ వసీమ్‌ సలీమ్‌
10. కడప : సురేష్‌బాబు
11. కర్నూలు : బీవై రామయ్య

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు.. నాడు– నేడు.. ఎంత వ్యత్యాసం..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి