iDreamPost

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా మనోజ్.. గతంలోనూ ఎన్నో రికార్డులు

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా మనోజ్.. గతంలోనూ ఎన్నో రికార్డులు

ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ ముకుంద్ నరవాణే తాజాగా నూతన ఇండియన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌ గా ఉన్న బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుండడంతో ఆయన స్థానంలో నరవాణే బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌‌గా పని చేయడానికి ముందు నరవాణే ఈస్ట్రన్ కమాండ్ బాధ్యతలను పర్యవేక్షించారు. చైనాతో సుమారుగా 4వేల కిలోమీటర్లు సరిహద్దుకు సంబంధించి ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు నరవానే చైనా సరిహద్దులో ఉన్న భారత సైన్యం ఈస్ట్రన్ కమాండ్ కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. 37ఏళ్ల సర్వీస్ ఉన్న నరవాణే జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు కీలక కమాండ్లలో విధులు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌తోపాటు.. ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు కూడా నాయకత్వం వహించారు. శ్రీలంకలో విధులు నిర్వహించిన భారత శాంతి దళాలల్లోనూ నరవాణే భాగమయ్యారు. మయన్మార్‌లోని ఇండియన్ ఎంబసీలో డిఫెన్స్ ఎటాచీగా పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారు.

నరవానే 1980లో సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లోని ఏడో బెటాలియన్‌లో చేరారు. సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్‌, అతి విశిష్ట సేవాల మెడల్‌ల్స్ అందుకున్నారు. ది సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో నియమితులయ్యారు. తన నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్‌లో, లెఫ్టినెంట్ జనరల్ గా నరవాణేనే జమ్మూ కాశ్మీర్‌లో సేవలందించారు. ఆపరేషన్ పవన్ సందర్భంగా శ్రీలంకలోని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో ఆయన కూడా ఒక భాగమయ్యారు. మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లపాటు పనిచేసారు. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ కు కమాండింగ్ ఆఫీసర్ గా చేసిన సేవలకుగానూ ఆయనను భారతదేశ ప్రభుత్వం ‘పరమ్ విశిష్ట సేవా మెడల్’ అవార్డుతో గౌరవించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి