iDreamPost

సలార్ చుట్టూ కొత్త కష్టాలు! ఒక్కోసారి క్రేజ్ కూడా శాపమే!

కేజీఎఫ్ సిరీస్‌తో టాప్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంతే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న బాలారిష్టాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి.

కేజీఎఫ్ సిరీస్‌తో టాప్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంతే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న బాలారిష్టాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి.

సలార్ చుట్టూ కొత్త కష్టాలు! ఒక్కోసారి క్రేజ్ కూడా శాపమే!

బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పీక్స్‌కు చేరింది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు, నటులు అతడితో పనిచేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేసేందుకు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్‌తో అలరించినప్పటికీ..  సంథింగ్ ఏదో అతడి నుండి ఎక్స్ ఫర్ట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్ కోర్. దానికి కారణం సాహో మినహాయించి.. మిగిలిన రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోవడమే. ఇప్పుడు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్‌తో ఈ లోటును పూడ్చేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్. పలుమార్లు ఈ సినిమా వాయిదా పడినప్పటికీ.. మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

కేజీఎఫ్ సిరీస్‌తో టాప్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ సలార్. రెండు పార్టులుగా సినిమా ఉండబోతున్న సంగతి విదితమే. సలార్ -1 సీజ్ ఫైర్ పై విపరీతమైన హైప్ వచ్చేసింది. విడుదల ఆలస్యం మినహాయించి..దీనిపై ఎటువంటి నెగిటివ్ వైబ్స్ లేవు. ఈ డిసెంబర్‌లో రావడం పక్కా అంటూ ప్రకటించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అభిమానులు. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ జరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు భారీ రేట్లకు కొనుకున్నాయని తెలుస్తోంది. ఇక్కడే కాకుండా నైజాంలో రూ. 90 కోట్లకి మైత్రీ నిర్మాణ సంస్థ కొనుగలు చేసింది. అలాగే కర్ణాటకలో ఈ మూవీ నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్ మొత్తంగా విడుదల చేస్తోంది.

ఇక మలయాళంలో ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళనాట ఆ రాష్ట్ర ముఖమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జైంట్ మూవీస్ భారీ రేటుకు రైట్స్ కొనుగోలు చేశారు. ఇక నాన్ థియేటరికల్ రైట్స్ కూడా భారీగా ముట్టిందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంతే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న బాలారిష్టాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. సినిమా విడుదల ఒక్కటే కాదూ.. మూవీ కలెక్షన్ల కూడా కీలకమే. ఈ మూవీ కొన్న బయ్యర్లు నష్టపోకుండా ఉండాలంటే .. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాల్సి ఉంటుంది. టికెట్ పై కనీసం 50 నుండి 70 రూపాయల వరకు పెంచితేనే.. లాభాల పడుతుంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టికెట్స్ రేట్లే కాదూ.. అదే రేంజ్‌లో సినిమా ఉంటేనే బయ్యర్లు సేఫ్ జోన్‌లో ఉంటారు. కొన్ని సార్లు  ఎక్స్ పక్టేషన్స్ కూడా శాపంగా మారుతుంటాయి. ఫ్యాన్స్ ఎక్స్ పర్టేషన్స్‌కు తగ్గట్టు మూవీ ఉంటేనే.. కొన్ని రోజుల పాటు మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. హౌస్ ఫుల్ కలెక్షన్లు కనిపిస్తేనే.. కాసుల వర్షం కురిసి.. ప్రాఫిట్ కనిపిస్తుంది. అప్పుడే సినిమా తీసినోళ్లకు, చూసినోళ్లకి నిజమైన సినిమా పండుగ.  అయితే  మరీ సినిమాపై ఆ రేంజ్ అంచనాలను.. పసందైన విందు భోజనాన్ని ఆమూవీ  టీం అందిస్తారో లేదో వెయిట్ చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి