iDreamPost

24 గంటల్లో భారీగా కొత్త కేసులు

24 గంటల్లో భారీగా కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 1,813 మంది వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే విధంగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా 31,787 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 1,008 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 7,797 మంది వైరస్ నుంచి కోలుకోవడం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో 22,882 మంది చికిత్స తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మరో నాలుగు రోజుల్లో రెండోదశ లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. మే 3న గడువు ముగుస్తుండగా తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలని సూచించాయి. కాగా, పంజాబ్ ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి